Live: కాకినాడలో పవన్​కల్యాణ్​ వారాహి విజయభేరియాత్ర - ప్రత్యక్షప్రసారం - pawankalyan varahi vijayabheri

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 5:27 PM IST

Updated : May 11, 2024, 5:59 PM IST

thumbnail

pawankalyan  : ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తన జోరు పెంచారు. వైఎస్సార్సీపీ, జగన్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గురువారం విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్‌ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగికదాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని పవన్‌ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం కాకినాడలో పవన్ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తున్నారు. కూటమి తరుఫున ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం పిఠాపురంలోని చిత్రాడ నుంచి పవన్‌ రోడ్‌ షో నిర్వహించారు. పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడలో పవన్‌కల్యాణ్‌ రోడ్‌ షో సాగింది. సాయంత్రం నుంచి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పవన్‌కల్యాణ్‌ రోడ్ షో జరిగింది. ప్రస్తుతం కాకినాడలో పవన్​ ప్రచార సభ ప్రత్యక్ష ప్రసారం. 

Last Updated : May 11, 2024, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.