LIVE: కడపలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - RAHUL GANDHI IN KADAPA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 12:29 PM IST

Updated : May 11, 2024, 1:43 PM IST

thumbnail

Rahul Gandhi Election Campaign: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కడపలో పర్యటిస్తున్నారు. కడపలో నిర్వహించే ఎన్నికల బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఇడుపులపాయకు చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కలిసి కడప నుంచి హెలికాప్టర్​లో ఇడుపులపాయ చేరుకున్నారు.ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద రాహుల్‌ నివాళులర్పించారు. అక్కడి నుంచి తిరిగి కడప చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న తరుణంలో, ఆమె గెలుపు కోసం రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బహిరంగసభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప బిల్టప్ సర్కిల్​లో నిర్వహించే కాంగ్రెస్ సభ కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కడప బిల్టప్‌ సర్కిల్‌లో బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.  

Last Updated : May 11, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.