ETV Bharat / sports

58 బంతుల్లోనే 166 ఉఫ్‌ - సన్​రైజర్స్​ ఖాతాలో రికార్డులే రికార్డులు - IPL 2024 LSG VS SRH

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 6:52 AM IST

Updated : May 9, 2024, 7:05 AM IST

IPL 2024 LSG VS SRH : తాజాగా ఉప్పల్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ ​ లఖ్​నవూను ఊచకోత కోసింది. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే?

The Associated Press
IPL 2024 LSG VS SRH (The Associated Press)

IPL 2024 LSG VS SRH : 47 నిమిషాలు 58 బంతులు 167 పరుగులు 0 వికెట్లు! తాజాగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్​ సృష్టించిన విధ్వంసమిది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలా ఊచకోత కోసింది . ఇన్నింగ్స్‌ బ్రేక్ టైమ్​లో ఫ్యాన్స్​ సరదాగా పోయి స్నాక్స్‌ తెచ్చుకునేలోపే హైదరాబాద్ కొట్టుడే కొట్టుడు అంటూ​ తన 166 పరుగుల లక్ష్య ఛేదన పూర్తి చేసేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 8×4, 6×6 75 నాటౌట్‌;), ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 8×4, 8×6 89 నాటౌట్‌;) ఉప్పెనలా విరుచుకుపడడంతో ఫలితంగా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటితో పాటు మ్యాచ్​కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

  • లఖ్​నవూ బౌలర్లను ఊతికారేసిన హెడ్‌, అభిషేక్​కు .మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ ఈ మ్యాచ్‌ ముగించేందుకు తీసుకున్న ఓవర్లు 9.4. దీంతో టీ20 హిస్టరీలోనే 150కుపైగా లక్ష్య ఛేదనను అత్యంత వేగంగా పూర్తి చేసిన జట్టుగా సన్‌రైజర్స్​ నిలిచింది.
  • ఐపీఎల్‌ హిస్టరీలో అత్యధిక బంతులు మిగిలుండగా (100 కన్నా ఎక్కువ లక్ష్యం ఉన్న మ్యాచుల్లో) గెలుపొందిన జట్టుగా హైదరాబాద్‌ రికార్డుకెక్కింది.
  • ఈ మ్యాచ్​లో సన్‌రైజర్స్‌ 167 పరుగులు చేసింది. ప్రపంచ టీ20 క్రికెట్లో మొదటి 10 ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
  • ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 1000 సిక్సర్లు రికార్డు అయ్యేందుకు 13,079 బంతులు పట్టింది. ఐపీఎల్ హిస్టరీలో ఇది అత్యంత వేగవంతమైన రికార్డు. కాగా, 2023లో 1000 సిక్సర్లు నమోదు చేసేందుకు 15,390 బంతులు పట్టాయి.
  • ఒక సీజన్​లో అత్యధిక సిక్స్‌లు (146 సిక్సర్లు, 12 మ్యాచ్‌ల్లో) బాదిన జట్టుగా సన్​రైజర్స్​ నిలిచింది. 2018లో చెన్నై 16 మ్యాచులు 145 సిక్స్‌ల రికార్డును అధిగమించింది.
  • ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్‌లు (35) బాదిన ఆటగాడిగా అభిషేక్ శర్మ ఉన్నాడు. 195 బంతుల్లోనే ఈ మార్క్​ను సాధించాడు.
  • ఒక సీజన్‌లో సన్​రైజర్స్​ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్​ కూడా అభిషేక్ శర్మనే కావడం విశేషం.
  • ఈ మ్యాచ్​ పవర్‌ ప్లేలో హైదరాబాద్​ 107 పరుగులు చేసింది. టీ20లో మొదటి ఆరు ఓవర్లలో రెండో అత్యధిక స్కోరు​ ఇది. మొదటి స్థానంలోనూ హైదరాబాదే ఉంది. అది కూడా ఈ సీజన్‌లో బాదిందే. దిల్లీ క్యాపిటల్స్​పై 125 పరుగులు చేసింది.
  • ఒకే సీజన్‌లోని పవర్ ప్లేలో రెండు సార్లు 100 కన్నా ఎక్కువ రన్స్ సాధించిన మొదటి జట్టుగా సన్​రైజర్స్​ నిలిచింది.
  • ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో అత్యధిక సార్లు 50 కన్నా ఎక్కువ పరుగులు చేసిన రెండో ప్లేయర్​గా ట్రావిస్ హెడ్(4) నిలిచాడు. ఇవన్నీ అతడు ఈ సీజన్‌లో సాధించినవే. వార్నర్ (6) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
  • ఇక పవర్‌ప్లేలో లఖ్‌నవూ చేసిన స్కోరు 27/2. ఐండియన్ ప్రీమియర్ లీగ్​ హిస్టరీలో ఆ జట్టుకు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు కావడం గమనార్హం.

ట్రావిస్​, అభిషేక్ మెరుపులు - ఒక్క వికెట్ కోల్పోకుండా సన్​రైజర్స్ విక్టరీ - SRH VS LSG IPL 2024

ఆన్​లైన్​లో టీ20 ప్రపంచకప్‌ జెర్సీ - మీరూ సొంతం చేసుకోవాలా? - ధర ఎంతంటే? - T20 World Cup 2024 Jersey

Last Updated :May 9, 2024, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.