ETV Bharat / sports

ట్రావిస్​, అభిషేక్ మెరుపులు - ఒక్క వికెట్ కోల్పోకుండా సన్​రైజర్స్ విక్టరీ - SRH VS LSG IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 10:15 PM IST

Updated : May 8, 2024, 10:33 PM IST

SRH VS LSG IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. లఖ్​నవూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా చేధించింది.

SRH VS LSG IPL 2024
SRH VS LSG IPL 2024 (Source : Associated Press)

SRH VS LSG IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్, లఖ్​నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. లఖ్​నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా చేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), ట్రావిస్ హెడ్(89) తమదైన శైలిలో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత కాస్త డీలా పడింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతుల కష్టాల్లో పడింది.

దీంతో ఆ జట్టును ఆదుకునేందుకు క్రీజులోకి వచ్చిన ఆయుశ్​ బదోని (55*), నికోలస్ పూరన్‌ (48*)కీలక ఇన్నింగ్స్‌లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక కెప్టెన్‌ కేఎల్​ రాహుల్‌ (29), కృనాల్‌ పాండ్య (24) ఫర్వాలేదనిపించారు. ఇక క్వింటన్ డికాక్ (2), స్టాయినిస్ (3) మాత్రం పేలవ ఫామ్​తో విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌ (2/12) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్
ఇంపాక్ట్ సబ్​స్టిట్యూట్స్ : గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తుది జట్టు : కే ఎల్ రాహుల్ (కెప్టెన్​), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుశ్​ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్
ఇంపాక్ట్ సబ్​స్టిట్యూట్స్ : మణిమారన్ సిద్ధార్థ్, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్, అష్టన్ టర్నర్, అమిత్ మిశ్రా.

ప్రాక్టీస్​ సెషన్​లో తప్పిదం - ఫ్యాన్​ ఐఫోన్‌ పగలకొట్టిన చెన్నై క్రికెటర్ - ఆ తర్వాత ఏం చేశాడంటే? - Daryl Mitchell CSK

ధోనీ నెం.9లో ఎందుకు వచ్చాడంటే? - అసలు రీజన్ ఇదే - IPL 2024 CSK

Last Updated :May 8, 2024, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.