ETV Bharat / entertainment

పెళ్లికి ముందే గర్భవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ - Sriranga Neethulu Review

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 9:28 AM IST

Updated : Apr 12, 2024, 11:32 AM IST

Sriranga Neethulu Review : ఈ వారం తెలుగు బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిన్న చిత్రాల్లో శ్రీరంగ‌నీతులు ఒక‌టి. మంచి క‌థ‌ల్ని సెలక్ట్ చేసుకుంటారనే పేరున్న సుహాస్‌, రుహానీ శర్మ, బేబితో హిట్ అందుకున్నవిరాజ్ అశ్విన్‌, కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేమ్​కార్తీక్‌ర‌త్నం క‌లిసి నటించిన సినిమా ఇది. మ‌రి చిత్రం ఈ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

పెళ్లికి ముందే గర్బవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ
పెళ్లికి ముందే గర్బవతి అయితే - సుహాస్ కొత్త సినిమా రివ్యూ

Sriranga Neethulu Review :

చిత్రం : శ్రీ రంగ‌నీతులు;

న‌టీన‌టులు : సుహాస్‌, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, రాగ్ మ‌యూర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, దేవీ ప్ర‌సాద్, సంజ‌య్ స్వ‌రూప్‌,సీవిఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు;

సంగీతం : హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర్సాడ‌;

ఛాయాగ్ర‌హ‌ణం : టిజో టామి;

నిర్మాత‌ : వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి,;

క‌థ‌,మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్;

నిర్మాణ సంస్థ‌ : రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌;

ఈ వారం తెలుగు బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిన్న చిత్రాల్లో శ్రీరంగ‌నీతులు ఒక‌టి. మంచి క‌థ‌ల్ని సెలక్ట్ చేసుకుంటారనే పేరున్న సుహాస్‌, రుహానీ శర్మ, బేబితో హిట్ అందుకున్నవిరాజ్ అశ్విన్‌, కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేమ్​కార్తీక్‌ర‌త్నం క‌లిసి నటించిన సినిమా ఇది. మ‌రి చిత్రం ఈ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

క‌థేంటంటే ? - నాలుగు జీవితాల‌తో ముడిప‌డిన మూడు క‌థ‌ల స‌మాహార‌మే ఈ సినిమా. టెక్నీషియ‌న్‌గా ఓ బస్తీలో జీవనం కొనసాగించే శ్యాంసంగ్ శివకు (సుహాస్) ఫ్లెక్సీలు అంటే విపరీతమైన పిచ్చి. పొలిటికల్ లీడర్స్​తో ఫొటో దిగి దాన్ని అంద‌రూ చూసేలా ఫ్లెక్సీ వేయించుకుని త‌న గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలనేది అతడి ఆశ‌. అయితే ఓ రోజు అలా వేయించిన ఫ్లెక్సీ తెల్లారేస‌రికి మాయమైపోతుంది. త‌నంటే ప‌డ‌ని మ‌రో గ్యాంగ్ ఆ ఫ్లెక్సీని మాయం చేసిందని వాళ్లతో గొడ‌వ‌కి దిగుతాడు సుహాస్​. మ‌ళ్లీ శివ ఫ్లెక్సీ వేయించాడా లేదా అనేది కథలో కీలకం. కార్తీక్ (కార్తీక్ ర‌త్నం) జీవితంలో అనుకున్న‌ది సాధించ‌లేక‌ మ‌ద్యానికీ, గంజాయికీ బానిసై తిరుగుతుంటాడు. అయితే త‌న కొడుకు మారితే చూడాల‌ని తపన పడిన ఓ తండ్రి (దేవిప్ర‌సాద్‌)కి మ‌రో త‌ల‌నొప్పి కూడా ఉంటుంది. ఇంట్లో సెల్ఫీ దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన చిన్న కొడుకు కోసం పోలీసులు ఇంటికొస్తారు. మరి ఆ చిన్న కొడుకు పోలీసులు ఇంటికొచ్చేలా ఏం చేశాడు, పెద్ద కొడుకు మారాడా? అనే మరో కథ. ఇక ప్రేమికులైన ఐశ్వ‌ర్య (రుహానీశ‌ర్మ‌), వ‌రుణ్ (విరాజ్ అశ్విన్‌) తమ విషయాన్ని ఇంట్లో పెద్ద‌ల‌కి చెప్పే ధైర్యం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే గర్భవతి కూడా అవుతుంది. మ‌రి వీరి జీవితాలు ఎలాంటి మ‌లుపు తిరిగాయనేదే మొత్తం సినిమా కథ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలా ఉందంటే ? - అసంపూర్ణం అనిపించేలా క‌థ‌లు, ల‌క్ష్యమంటూ లేని పాత్ర‌ల‌తో ఈ ఆంథాలజీ చిత్రం రూపుదిద్దుకుంది, ఇప్పటి జనరేషన్​కు చెందిన న‌లుగురి జీవితాల్లో ఓ ద‌శ‌లో ఎదుర్కొన్న అనుభ‌వాలను ఇందులో చూపించారు. అయితే సినిమా పేరులో ఉన్న నీతులు క‌థ‌ల్లో మాత్రం ఎక్క‌డా క‌నిపించినట్టు లేదు. అక్కడక్కడ కాస్త కామెడీ మెప్పించింది. ఫైనల్​గా ఫస్ట్ హాప్​ క‌థేమీ లేకుండానే, నిదానంగా సాగుతూ ఆ పాత్రలు ఎలాంటి మ‌లుపు తీసుకుంటాయ‌నే ఉత్సుక‌తను రేకెత్తిస్తుంది. కానీ సెకండాఫ్​లో కొత్త విషయం ఉండదు. కేవలం సాగదీత మాత్రే కనిపిస్తుంది. ఏ క‌థ‌కీ స‌రైన ముగింపు ఉండదు. ఫైనల్​గా కాలం చెల్లిపోయిన క‌థ‌లు ఇవ‌న్నీ అనే చెప్పాలి. అయితే ర‌చ‌న‌లో మాత్రం అక్క‌డ‌క్క‌డా మెరుపులు క‌నిపించాయి.

ఎవ‌రెలా చేశారంటే ? - సుహాస్‌, విరాజ్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానీ న‌లుగురూ మంచిగా నటించారు. బ‌స్తీ కుర్రాడిగా సుహాస్‌, చెడు వ్య‌స‌నాల‌కు బానిసైన యువ‌కుడిగా కార్తీక్ ర‌త్నం న‌ట‌న మరింత బాగుంది. గర్బవతి అయ్యాననే అనుమానంతో వేదనకు గురయ్యే యువతి పాత్రలో రుహానీ శర్మ చక్కగా నటించింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో మెచ్యురిటీతో విరాజ్ నటించాడు. కార్తీక్ తండ్రిగా దేవీ ప్ర‌సాద్ న‌ట‌న కూడా బాగుంది. సినిమాలో ప్ర‌తి సన్నివేశం సహంగానే కనిపించేలా, అలానే కొన్ని సీన్స్​పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు దర్శకుడు. కానీ డైలాగ్స్​, పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న, వాటిని న‌డిపించిన తీరు, కథ, కథనాల్లో బలం చూపించలేకపోయాడు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.



ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు! - This Week OTT Releases

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్: స్క్రీనింగ్ కాంపిటీషన్​లో​ ఇండియన్ మూవీ- 30ఏళ్లలో ఇదే తొలిసారి - Cannes Film Festival 2024

Last Updated :Apr 12, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.