ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: ఆరెంజ్​ ఆర్మీ సారథిగా డేవిడ్​ వార్నర్​

author img

By

Published : Feb 27, 2020, 1:36 PM IST

Updated : Mar 2, 2020, 6:08 PM IST

ఐపీఎల్ 13వ సీజన్​ మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం​ తీసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్​​ యాజమాన్యం. గత సీజన్​కు కెప్టెన్​గా ఉన్న కేన్​ విలియమ్సన్​ స్థానంలో.. ఆస్ట్రేలియా క్రికెటర్​, గతేడాది ఐపీఎల్​ పరుగుల వీరుడైన వార్నర్​ను సారథిగా నియమించింది.

IPL 2020: David Warner Again captain for Sun risers Hyderabad  for upcoming season from march 29
ఐపీఎల్​ 2020: సన్​రైజర్స్ జట్టు​ కెప్టెన్​గా పరుగుల వీరుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​) 13వ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో తమ జట్టు సారథిగా డేవిడ్ వార్నర్‌ను నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గతంలో కెప్టెన్​గా పనిచేసిన కేన్​ విలియమ్సన్​.. ఆటగాడిగా కొనసాగనున్నాడు.

కెప్టెన్​గా కప్పు తెచ్చాడు..

డేవిడ్ వార్నర్.. 2016లో సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లోనే జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి వార్నర్‌ జట్టును విజేతగా నిలుపుతాడనే నమ్మకంతోనే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2018లో బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో.. వార్నర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆడలేదు. 2019 ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతనిపై ఉన్న నిషేధం ముగియడం వల్ల తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే కెప్టెన్సీ మాత్రం కేన్ విలియమ్సన్​కు అప్పగించారు. రీఎంట్రీలో వార్నర్ బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, సన్​రైజర్స్​ మరో ఓపెనర్​ జానీ బెయిర్‌స్టోతో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అంతేకాకుండా 692 పరుగులతో గతేడాది టోర్నీ అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్​ క్యాప్​నూ​ సొంతం చేసుకున్నాడు వార్నర్​.

Last Updated :Mar 2, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.