ETV Bharat / international

స్వీయ నిర్భంధంలోకి డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​!

author img

By

Published : Nov 2, 2020, 9:57 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్.. హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తాను ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తిని కలిసిన తరుణంలో క్వారంటైన్​లోకి వెళ్లినట్టు అథనోమ్ తెలిపారు.

WHO director general self-isolates after coming in contact with COVID-19 infected person
స్వీయ నిర్భంధంలోకి డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​!

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్​ టెడ్రోస్ అథనోమ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తిని కలిసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ​.

"కరోనా సోకిన ఓ వ్యక్తిని కలిశాను. ప్రస్తుతం బాగానే ఉన్నా. ఎటువంటి లక్షణాలు లేవు. అయితే కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. డబ్ల్యూహెచ్​ఓ నిబంధనల ప్రకారం ఇంటి నుంచి పని చేస్తాను."

- టెడ్రోస్ అథనోమ్

ఈ విపత్తు సమయంలో ఆరోగ్య వ్యవస్థపై భారం పడకుండా వైద్యుల సూచనలు పాటించడం ముఖ్యమని అథనోమ్​ అన్నారు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​​ ప్రతిపక్షనేతపై దేశద్రోహం కేసు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.