ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా గృహనిర్బంధం

author img

By

Published : Aug 5, 2019, 5:56 AM IST

Updated : Aug 5, 2019, 8:05 AM IST

ఆపరేషన్​ కశ్మీర్​: ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా గృహనిర్బంధం

జమ్ముకశ్మీర్​ అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అమర్​నాథ్​ యాత్ర అర్ధంతరంగా రద్దు, భారీగా బలగాల మోహరింపుతో రాష్ట్రంలో ఏదో జరగబోతోందన్న అనుమానాలతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఏం జరగనుందో దేవునికే తెలుసంటూ ట్వీట్​ చేశారు ముఫ్తీ. శాంతియుతంగా ఉండాలని ఒమర్​ పేర్కొన్నారు.

ఒమర్​ అబ్దుల్లా, ముఫ్తీ గృహనిర్బంధం

జమ్ముకశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యలతో ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా ముందుజాగ్రత్తగా.. కశ్మీర్​లో కీలక నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహనిర్బంధం చేశారు పోలీసులు.

తమ ఇళ్లనుంచి బయటకు అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు.. తమను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్​ నేత ఉస్మాన్​ మజీద్​, సీపీఐ ఎమ్మెల్యే తరిగామి. అయితే.. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది.

దేవుడికే తెలుసు...

తనను గృహనిర్బంధం చేసిన అనంతరం.. కేంద్ర ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు ముఫ్తీ. వరుస ట్వీట్లు చేశారు. గృహనిర్బంధంతో మాట్లాడే వారి నోళ్లు మూయించాలని చూస్తున్నారని.. అయితే ఇదంతా ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు. 'రేపు ఏం జరుగుతుందో.. దేవుడికే తెలుసంటూ' మరో ట్వీట్​ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

  • Hearing reports about internet being snapped soon including cellular coverage. Curfew passes being issued too. God knows what awaits us tomorrow. It’s going to be a long night.

    — Mehbooba Mufti (@MehboobaMufti) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని వాజ్​పేయీని జ్ఞప్తికి తెచ్చుకున్నారు ముఫ్తీ. భారతీయ జనతా పార్టీకి చెందిన వారైనప్పటికీ ఆయన కశ్మీరీ ప్రజల ప్రేమ చూరగొన్నారని.. నేడు వాజ్​పేయీ లేని లోటు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

  • Vajpayee ji despite being a BJP leader empathised with Kashmiris & earned their love. Today we feel his absence the most.

    — Mehbooba Mufti (@MehboobaMufti) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఆనందించేవారు.. తదుపరి పరిణామాలను ఊహించలేకపోతున్నారన్నారు.

శాంతియుతంగా ఉండండి: ఒమర్​

  • I’m especially concerned about the people living in the Pir Panchal & Chenab Valley regions. These areas have been very susceptible to attempts at communal violence. I hope the Govt has taken adequate precautions to ensure no communal trouble breaks out.

    — Omar Abdullah (@OmarAbdullah) August 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రభుత్వం ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే.. తీవ్రమైన హింస చెలరేగే అవకాశముందని అభిప్రాయపడ్డారు నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత, మాజీ సీఎం ఒమర్​ అబ్దుల్లా. ముఖ్యంగా పీర్​ పంజాల్​, చీనాబ్​ ప్రాంతాల్లోని ప్రజలపై ఎక్కువగా ఆందోళన ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా.. శాంతియుతంగా ఉండాలని ప్రజల్ని కోరారు. ప్రస్తుత పరిస్థితి ఏం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రజలు ప్రశాంతంగా ఉండాలని.. ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా' అని ట్వీట్​ చేశారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Camp Nou, Barcelona, Spain. 4th August, 2019.
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: SNTV
DURATION: 07:25
STORYLINE:
Reaction after Barcelona came from a goal down to beat Arsenal 2-1 to win the Joan Gamper Trophy on Sunday.
Luis Suarez scored a last-minute winner after an Ainsley Maitland Niles own goal had handed Barcelona their first.
Pierre-Emerick Aubameyang had given Arsenal a first-half lead.
Last Updated :Aug 5, 2019, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.