ETV Bharat / technology

సోషల్ మీడియా నయా ట్రెండ్​ - 'లుక్​ బిట్వీన్​ యువర్​ కీబోర్డ్' - ఇంతకీ ఏంటిది? - Look Between Trend

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 3:45 PM IST

viral 'look between X and Y on your keyboard' trend
look between X and Y on your keyboard

Look Between Trend : సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటి నుంచి ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతోందో తెలియడం లేదు. ఇప్పుడు 'లుక్ బిట్ వీన్' అనే పేరుతో సరికొత్త ట్రెండ్ షురూ అయ్యింది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్? ఎక్కడ మొదలైంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Look Between Trend : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. అయితే దీనితో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమేనా, కాదా అని నిర్ధరణ చేసుకోకముందే వాటిని చాలా మంది షేర్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉన్నవారికి ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో సులభంగా తెలుస్తుంది.
అందుకే ఆ ట్రెండ్​ను అందిపుచ్చుకుని, వెంటనే పోస్టులు కూడా పెడుతుంటారు. ఇంకొందరైతే ఈ పోస్టులకు అర్థాన్ని తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం అలా ట్రెండ్ అవుతున్నదే 'లుక్ బిట్ వీన్ యువర్ కీ బోర్డు ట్రెండ్'. ఇంతకీ ఏమిటీ ట్రెండ్? ఎక్కడ మొదలైంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

'లుక్ బిట్ వీన్ H అండ్ L ఆన్ యువర్ కీ బోర్డు' అంటూ కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. సాధారణంగా మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్ JKఅని ఉంటాయి. దాని అర్థం జస్ట్ కిడ్డింగ్ అని. ఇంటర్వ్యూయర్ చూపు ఎప్పుడూ X అండ్ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. అభ్యర్థి CVపైనే ఫోకస్ ఉంటుందన్న అర్థంలో దాన్ని పోస్టు చేశాడు. ఇవేకాదు ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లే కాదు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్​ రికార్డ్స్, అమెజాన్ ప్రైమ్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, స్విగ్గీ కూడా ఈ ట్రెండ్​ను అందిపుచ్చుకుని పోస్టులు పెట్టాయి.

ఈ ట్రెండ్ ఎక్కడ మొదలైంది?
ఈ ట్రెండ్ ఈనాటిది కాదు. 2021లో 4Chan అనే వెబ్​సైట్లో ఈ ట్రెండ్ మొదలైంది. K-ON అనే యానిమేటెడ్ సిరీస్​లో ఓ పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్​ను ఉపయోగించారు. అప్పట్లో లుక్ బిట్ వీన్ T అండ్ O అంటూ YUI అనే పాత్రను పరిచయం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ట్రెండ్ మళ్లీ మొదలైంది. దీనిపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేలంవెర్రి కాకపోతే మరేంటీ అంటూ ఫైర్ అవుతున్నారు.

మీ ల్యాప్​టాప్​ 'బ్యాటరీ హెల్త్' చెక్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check Laptop Battery Health

వాట్సాప్​, ఇన్​స్టా యూజర్ల కోసం - మెటా​ న్యూ AI అసిస్టెంట్ - ఏం అడిగినా క్షణాల్లో రిప్లై! - WhatsApp AI Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.