ETV Bharat / technology

కొత్త యూజర్లకు మస్క్ షాక్ - ఇకపై 'X'లో పోస్ట్ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే! - Elon Musk Plans To Charge X Users

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 4:02 PM IST

Elon Musk Plans To Charge New Twitter Users
Elon Musk plans to charge new X users

Elon Musk Plans To Charge New X Users : ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్(ట్విట్టర్) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎక్స్‌ అకౌంట్‌ తీసుకునేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ చేయాలన్నా, ట్వీట్​లకు లైక్‌ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, చివరికి బుక్‌మార్క్‌ చేయడానికి కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Elon Musk Plans To Charge New X Users : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్​ఫామ్ ఎక్స్‌(ట్విట్టర్) యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ మరోసారి షాకిచ్చారు. కొత్తగా ఎక్స్‌(ట్విట్టర్) అకౌంట్‌ తీసుకునేవారు డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ చేయాలన్నా, ట్వీట్​లకు లైక్‌ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, చివరికి బుక్‌మార్క్‌ చేయాలన్నా ఛార్జ్ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

బాట్స్​ను అడ్డుకోవడానికే!
కొత్త ఎక్స్​ వినియోగదారులు నామమాత్రపు వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ఎలాన్ మస్క్​ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ కొత్త యూజర్లు రైటింగ్ యాక్సెస్ కోసం చిన్నమొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బాట్‌ల దాడిని అరికట్టడానికి ఇదే ఏకైక మార్గమన్నారు. మూడు నెలల తర్వాత కొత్త యూజర్లు ఎక్స్​లో ఉచితంగా ట్వీట్​లు, పోస్ట్​లు పెట్టగలరని పేర్కొన్నారు.

ట్విట్టర్​ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేపట్టారు ఎలాన్ మస్క్. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్​గా మార్చారు. ఎక్స్ మాధ్యమంలో సమూల మార్పులకోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొత్త యూజర్లపై ఛార్జీల భారం వేశారు. అయితే ఈ ఛార్జీల పెంపుపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి.

ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలోని ఎక్స్ పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై ఇటీవలే నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి 26 - మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలను తొలగించినట్లు ఎక్స్ వెల్లడించింది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని పేర్కొంది. కంపెనీ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని ప్రకటించింది.

‘భారత్‌లోని యూజర్ల నుంచి 5,158 ఫిర్యాదులను స్వీకరించామని, వాటిలో 86 ఫిర్యాదుల్ని ప్రాసెస్‌ చేశామని ఎక్స్ పేర్కొంది. పరిశీలన అనంతరం వాటిలో 7 అకౌంట్లను రద్దు చేశామని తెలిపింది. భారత్‌ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో వేధింపులు (3,074), ద్వేషపూరిత ప్రవర్తన (412), అడల్ట్‌ కంటెంట్ (953) వంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1,235 ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది.

యాపిల్ యూజర్స్​కు గుడ్ న్యూస్ - ఇకపై పాత ఫోన్‌ పార్ట్స్‌తో రిపేర్‌! - Apple Expands Repair Options

రూ.10వేల బడ్జెట్​లో మంచి ఫోన్ కొనాలా? టాప్​-10 మొబైల్స్​ ఇవే! - Best Phones Under 10000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.