ETV Bharat / health

ఇది ఒక్క స్పూన్​ తింటే చాలు - సమ్మర్​లో ఈ సమస్యలన్నిటికీ ఈజీగా చెక్​! - Health Benefits of Eating Gulkand

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 1:19 PM IST

Gulkand Benefits: వేసవిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీంతో పాటు సౌందర్య పరంగానూ అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటన్నింటినీ ఏకకాలంలో ఎదుర్కొనే అద్భుత ఔషధం మన వంటింట్లోనే ఉందంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Health Benefits of Gulkand
Health Benefits of Eating Gulkand (ETV Bharat)

Health Benefits of Eating Gulkand: ఎండాకాలంలో చాలా మందిని గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ఈ క్రమంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పదార్థాల్ని తీసుకోవాలని అంటుంటారు. అలా బాడీకి చలువ చేసే ఫుడ్స్​లో గుల్‌కంద్ ఒకటని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ వేసవిలో రోజుకో టీస్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలకు సంబంధించిన నెలసరి సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందంటున్నారు. ఈ క్రమంలో గుల్‌కంద్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

గుల్‌కంద్.. గులాబీ పూరేకలతో చేసే ఈ జామ్ చూడగానే తినాలన్నంత ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. చక్కటి రుచి, సువాసనను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ వేసవిలో దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వేసవి తాపానికి దూరంగా ఉండచ్చు. ఇక ఇతర ప్రయోజనాలు చూస్తే..

  • ప్రస్తుతం చాలా మంది మహిళలు పీసీఓఎస్‌(PCOS)తో బాధపడుతున్నారు. వీరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల మేని ఛాయ తగ్గడం, చర్మంపై క్రాక్స్​, అవాంఛిత రోమాలు, మొటిమలు.. వంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి వారు రోజుకో టీస్పూన్ చొప్పున గుల్‌కంద్ తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
  • థైరాయిడ్‌తో బాధపడుతోన్న వారికి పీరియడ్స్​ ముందు స్పాటింగ్, బ్లాక్ డిశ్చార్జ్, బ్రౌన్ డిశ్చార్జ్.. వంటివి కామన్​. అలాంటప్పుడు ఈ గుల్‌కంద్‌ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.
  • శరీరంలో బ్లడ్​ తక్కువగా ఉన్న వారు గుల్‌కంద్‌ని తీసుకోవడం వల్ల రక్తాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడానికీ ఇది తోడ్పడుతుందని అంటున్నారు.

ఎంత ట్రై చేసినా నైట్‌ నిద్రపట్టడం లేదా ? అయితే మీరు ఈ లోపంతో బాధపడుతున్నట్లే! - Magnesium Foods Sources

  • మలబద్ధకంతో బాధపడే వారు గుల్‌కంద్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా ఈ సమస్య నుంచి బయటపడచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే చాలా మంది పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉంటుంది. అలాంటివారికీ దీన్ని అందిస్తే సత్వర పరిష్కారం దొరుకుతుంది. 2019లో పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్​ హెపటాలజీ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గుల్​కంద్ తీసుకున్న పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని AIIMS లో పనిచేసే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డా. అశోక్ కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు. మలబద్ధకంతో బాధపడుతున్న పిల్లలకు గుల్​కంద్ సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అని ఆయన పేర్కొన్నారు. ​
  • అలసటను దూరం చేసుకొని శక్తిని పెంచుకోవడానికి, చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి, అజీర్తిని దూరం చేసుకోవడానికి.. ఇలా అన్ని సమస్యలకు గుల్‌కంద్ పరిష్కారం చూపుతుంది.
  • ఎసిడిటీ వల్ల చాలా మందికి రాత్రుళ్లు నిద్ర పట్టదు. అలాంటివారు రాత్రి నిద్ర పోయేముందు ఓ గ్లాసు పాలల్లో టీస్పూన్ గుల్‌కంద్ కలుపుకొని తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుందంటున్నారు.
  • కొంతమందికి భోజనం తర్వాత స్వీట్​ తినాలనిపిస్తుంటుంది. మరికొంతమంది టీ/కాఫీ తాగాలనిపిస్తుంది. ఇలాంటి వారు గుల్‌కంద్‌తో ఈ కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇందుకోసం భోంచేశాక టీస్పూన్ గుల్‌కంద్ తింటే సరిపోతుంది.
  • పరగడుపున, భోజనం తిన్న తర్వాత టీస్పూన్ గుల్‌కంద్ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది.
  • బాలింతలు, దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్యలున్న వారు, ఐరన్-ఫోలికామ్లం లోపంతో బాధపడుతున్నవారు.. తమలపాకుపై టీస్పూన్ గుల్‌కంద్‌ని వేసుకొని పాన్‌లాగా చుట్టుకుని.. రోజూ భోజనం తర్వాత తీసుకుంటే ఐరన్ స్థాయులు పెరుగుతాయని చెబుతున్నారు.

ఎలా తయారుచేసుకోవాలంటే..?

Gulkand Making Process:

  • ఒక గ్లాస్ జార్‌లో అడుగు భాగంలో కొన్ని గులాబీ పూరేకల్ని ఉంచి.. దానిపై కాస్త చక్కెర పోయాలి.
  • ఆపై గులాబీ రేకలు-చక్కెర.. ఇలా జార్ మొత్తాన్ని ఈ రెండు పదార్థాలతో లేయర్లుగా నింపుకోవాలి.
  • ఇప్పుడు ఈ జార్ మొత్తాన్ని సూర్యరశ్మి తగిలే చోట పది రోజుల పాటు ఉంచితే రుచికరమైన గుల్‌కంద్ తయారవుతుంది.
  • గుల్‌కంద్ తయారీలో ఒకవేళ చక్కెర వద్దనుకుంటే - బెల్లం పౌడర్​ వాడుకోవచ్చు.

నెలరోజుల పాటు డైలీ నట్స్​ తింటే - మీ శరీరంలో జరిగే మార్పులివే! - Benefits of Eating Nuts Daily

బరువు తగ్గాలని డిన్నర్​ స్కిప్​ చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి! - Skipping Dinner to Weight Loss

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.