ETV Bharat / state

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - Weather Report in 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 1:33 PM IST

Hottest Year 2024
Hottest Year 2024 (ETV Bharat)

2024 Is The Hottest Year : 2024 సంవత్సరం చరిత్రలోనే తొలి ఐదు అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ విషయంపై క్లైమేట్​ ట్రెండ్స్​ సంస్థ వివరాలను వెల్లడిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం పడుతుందని అంచనా వేసింది.

Climate Trends Report on Weather in 2024 Year : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024వ సంవత్సరం చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్​ ట్రెండ్స్​ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్​ నెలలో ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరవాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని ఈ సంస్థ వెల్లడించింది.

సూపర్​ ఎల్​నినో ప్రభావంతో 2023 జూన్​ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది. కానీ ఏప్రిల్​ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని చెప్పింది. అలాగే భారత్​లో జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్​పై వాతావరణ మార్పుల ప్రభావం ఉందంది. అందుకే మరోసారి దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?అనే అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది.

  • ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సంసిద్ధమయ్యారు.
  • సాధారణంగా ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు 4-8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి అది 10 నుంచి 20 రోజులకు పెరిగింది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో పది మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్​ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో అయితే 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది.
  • భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్​ నుంచి సముద్రగాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 శాతం ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్​నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్​నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్​ ఎల్​నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
  • దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని చోట్ల నమోదయ్యాయి. ఈ విషయంలో భారత తూర్పు తీర ప్రాంతం అత్యంత ప్రభావమైంది.
  • భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్​ నుంచి సముద్ర గాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
  • అమెరికాకు చెందిన క్లైమేట్​ సెంట్రల్​ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరవాత ఏప్రిల్​లో భారత్​లోని 51 ప్రధాన నగరాలకుగాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్​లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


భారత్​లో భిన్న వాతావరణ పరిస్థితులు - ఓచోట కరవు మరోచోట వరదలు - ఎందుకిలా? - Prof Raghu Murtugudde on Climate

మాజీ ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలు : యాసంగిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్​, కమిషనర్లు నివేదికలో వారి అభిప్రాయాలు తెలియజేశారు. ప్రస్తుత ఎన్నికలను 2023 డిసెంబరు 17 నుంచి 2024 జూన్​ 16 వరకు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అయితే నవంబరు, డిసెంబరుల్లో కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు ఉండటంతో లోక్​సభ ఎన్నికలు రెండు నుంచి మూడు నెలలు ఆలస్యం అవుతున్నాయి. భవిష్యత్తులో అఖిలపక్ష భేటీ నిర్వహించి రాష్ట్రాల ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం చేసి, లోక్​సభ ఎన్నికలు ఆ 6 నెలల కాలంలో నిర్వహించాలి.

2029లోనూ సాధారణ ఎన్నికలకు జనవరి 1 నుంచి జూన్​ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలమైన సమయం ఉంది. లేదంటే రాష్ట్రాల ఎన్నికలు కొంత ముందు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్​కు అధికారాలు కల్పిస్తూ చట్టసవరణ చేయాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్​ ఓపీ రావత్​ తెలిపారు. దేశంలో ఎన్నికలను 180 రోజుల్లోగా ఎప్పుడైనా నిర్వహించే వెసులుబాటు ఈసీ ఉంది. వేసవి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చేవారి కోసం తాగునీరు, చల్లటి ప్రదేశాలు ఉండాలి. అయితే ప్రభుత్వ పదవీ కాలాన్ని దక్కించడానికి వీలులేదు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో పరీక్షలు ఉంటాయి. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అకడమిక్​ క్యాలెండర్​ తప్పకూడదు. ఇందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశ్రాంత ఎన్నికల కమిషనర్​ అశోక్​ లావాస తెలిపారు.

'భవిష్యత్తులో వడగాలులు, వరదలు ఇంకా పెరుగుతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.