వైఎస్​ వివేకా హత్యపై జగన్​ వ్యాఖ్యలు - దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో ! - Jagan on YS Viveka Murder Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:18 AM IST

jagan_bus_trip

CM Jagan Comments on YS Viveka Murder Case: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్యపై సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో అనిపిస్తోంది. ఈ హత్య కేసులో అసలైన కుట్రదారు అవినాష్‌ రెడ్డేనని సీబీఐ తేల్చిచెప్పినా ఆయన్నే పక్కన పెట్టుకుని మరీ ఊసరవెల్లి కబుర్లు చెప్పారు. మా చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆదేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసంటూ జగన్‌ వ్యాఖ్యానించటం ఆయనే చెల్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చిన్నాన్నను ఎవరు చంపారో, ఎందుకు చంపించారో దేవుడికే తెలియాలి: సీఎం జగన్

Jagan Comments on YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని మరీ సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో అబద్దాలు వల్లె వేశారు. హత్యకు కుట్ర పన్నింది, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసింది కడప ఎంపీ అవినాష్‌ రెడ్డేనని సీబీఐ అభియోగపత్రంలోనే స్పష్టం చేసింది. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉందనీ తెలిపింది.

వివేకాతో అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి విభేదాలు ఉండటంతోనే ఈ కుట్రకు తెరలేపారని తేల్చింది. భాస్కరరెడ్డిని అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్ రిమాండులో ఉంచింది. అవినాష్‌ రెడ్డిని సాంకేతికంగా కాగితాలపై అరెస్టు చేసి వెంటనే బెయిల్ ఇచ్చేసింది. సీబీఐ ఇంత స్పష్టంగా అభియోగపత్రాల్లో వెల్లడిస్తే ఇంకా వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసనడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

సీఎం క్యాంప్​ ఆఫీసులోకి కంటెయినర్​- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? - Suspected Container Vehicle

దర్యాప్తు అధికారిపైనే కేసు: సీఎం జగన్‌ అన్నది నిజమే వివేకా హత్య కేసులో (YS Viveka murder case) ఎనిమిదో నిందితుడైన అవినాష్‌ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆయన స్వేచ్ఛకు కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఒక్కో తీగ లాగుతూ అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని బయటపెట్టే సమయంలో దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు.

అవినాష్‌ను సీబీఐ అనుమానితుడిగా గుర్తించిన వెంటనే ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ ఆయనకు క్లీన్చెట్ ఇచ్చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారు. సీబీఐ లాంటి సంస్థే ఆయనే కుట్రదారని చెబుతుంటే అందుకు విరుద్దంగా జగన్‌ మాట్లాడటమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి నిందితులకు ఎవరు మద్దతిస్తున్నారో తేలిపోతోంది.

ఉపాధి హామీ పథకానికి జగన్​ సమాధి - వేతనాలు నిలిచి కూలీల అవస్థలు - Rural Employment Guarantee Scheme

పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు: వివేకా హత్య కేసులో కుట్రదారుగా సీబీఐ పేర్కొన్న నిందితుడు అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది జగన్‌ ఆయన అనుచరగణం, ఆయన ప్రభుత్వ యంత్రాంగమే. అవినాష్ రెడ్డి నిందితుడని తేలాక పదేపదే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ న్యాయపరమైన చిక్కులు కల్పించారు. వాటన్నింటినీ దాటుకుని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా వారికి సహాయ నిరాకరణచేసి, ముప్పుతిప్పలు పెట్టారు.

నిందితులు జైల్లో ఉండాలని చెబుతున్న జగన్‌ ఆ నిందితుల్ని జైల్లోకి వెళ్లకుండా కాపాడారు. తన తండ్రి హంతకులకు, హత్య కుట్రదారులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న సునీతపై, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలపై అభాండాలు వేస్తున్నది ఎవరో అందరికీ కనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడుతున్న ఇద్దరు ఆడబిడ్డలపై బురద చల్లుతున్నది, చల్లిస్తున్నది ఎవరో ప్రతి ఒక్కరి కళ్లకూ కడుతోంది.

జగన్​ ఫొటోలు, వైసీపీ రంగులు - పట్టించుకోని అధికారులు - YSRCP ignores election code

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.