ETV Bharat / health

మీ ఇంట్లో ఏసీ లేకపోయినా - ఇలా చేస్తే ఇంటిని కూల్‌గా ఉంచొచ్చు! - Summer Home Cooling Tips

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 12:29 PM IST

Summer House Cooling Tips
Summer House Cooling Tips

Summer House Cooling Tips : రోజురోజుకూ ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా రోజంతా ఫ్యాన్‌లు, కూలర్‌లు, ఏసీలు గిర్రున తిరుగుతున్నాయి. అయినా.. ఇల్లు చల్లగా ఉండట్లేదని చాలా మంది వాపోతుంటారు. మీరు కూడా ఈ పరిస్థితిలో ఉంటే.. మేము చెప్పే టిప్స్‌ పాటించండి. దీంతో.. ఠండా ఠండా.. కూల్ కూల్ అని మీరు పాడుకోవచ్చు!

Summer House Cooling Tips : ఈ సమ్మర్‌ సీజన్‌లో ఎండలు మాములుగా లేవు. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. తీవ్రమైన వడగాలులు, ఉక్కపోత, ఎండవేడి కారణంగా ఉదయం పది దాటితే బయటకు వెళ్లలేకపోతున్నారు. అలాగని ఇంట్లో ఉన్నా కూడా వేడికి తట్టుకోలేకపోతున్నారు. రోజంతా జనం అల్లాడిపోతున్నారు.

ఇంట్లో ఉన్న వారంతా చల్లదనం కోసం కూలర్‌లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఏసీలు వాడే వారి సంగతి అటుంచితే.. కూలర్లు, ఫ్యాన్లు వాడే వారు వేడి గాలితో అవస్థలు పడుతున్నారు. పైగా.. నెత తిరిగే సరికి వచ్చే కరెంట్ బిల్లుతో బెంబేలెత్తి పోతున్నారు. ఇలాంటి వారికోసమే కొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. కొన్నేళ్ల క్రితం ఏసీలు, కూలర్లు లేనప్పుడు ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ప్రజలు కొన్ని పద్ధతులు పాటించారు. అవే పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

వట్టివేళ్లతో ఎంతో మేలు :
ఇప్పుడంటే.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉపయోగిస్తున్నారు కానీ.. ఇవేవి లేనప్పుడు ఇంటిలోపల చల్లగా ఉండటానికి చాలా మంది జనాలు ఇంటి తలుపులు, కిటికీల దగ్గర వట్టివేళ్లతో అల్లిన చాపలను వేలాడ తీసుకునేవారు. అప్పుడప్పుడు వీటిపైన నీళ్లను చల్లితే ఇంటిలోపల ఎంతో చల్లగా ఉండటంతోపాటు, మంచి సువాసన ఉండేది. కాబట్టి.. ఏసీలు వాడని వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. ప్రస్తుతం ఇవి మార్కెట్లో అందుబాటులో కూడా ఉన్నాయి.

బార్లీ వాటర్​ - ఎండ నుంచి రక్ష మాత్రమే కాదు - ఈ సమస్యలకు కూడా దివ్యౌషధం! - Barley Water Benefits in Summer

  • రేకుల ఇళ్లు ఉన్న వారు ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి పైన వైట్‌ పెయింట్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కొంత వరకు ఇంటి లోపల కూల్‌గా ఉంటుందని అంటున్నారు.
  • బిల్డింగ్‌లు ఉన్న వారు కూడా మార్కెట్లో దొరికే కూల్‌ రూఫ్‌ పెయింట్ వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
  • అలాగే కిటికీలు, తలుపులకు లైట్‌ కలర్‌లో ఉన్న కర్టెన్‌లను వేలాడ తీసుకోవాలి. వీటివల్ల చాలా వరకు ఇంట్లోకి ఎండవేడి రాకుండా ఉంటుంది.
  • వీలైతే ఇంటి ఆవరణలో చెట్లను పెంచుకోవాలి. చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి వల్ల ఎండవేడి, ఉక్కపోతగా అనిపించదు.
  • చిన్న ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండే వారు బాల్కనీల్లో పూల కుండీల్లో చెట్లను పెంచుకోవాలి. వీటివల్ల కొంత వరకు కూల్‌గా ఉంటుంది.
  • అలాగే గదుల్లో కూడా అక్కడక్కడా మొక్కలను ఉంచితే మంచిది. ఇవి ఎండవేడిని తగ్గించడంతో పాటు ఇంటి లోపల ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుతాయని నిపుణులంటున్నారు.
  • కలబంద, స్నేక్ ప్లాంట్, బేబీ రబ్బర్ ప్లాంట్, గోల్డెన్ పాటోస్.. వంటి ఇండోర్‌ ప్లాంట్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.
  • ఇంటిపైన సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంట్‌ బిల్లు ఆదాతో పాటు వేసవి కాలంలో చల్లగా కూడా ఉంటుందని సూచిస్తున్నారు.

సమ్మర్​లో మీ కళ్లు సేఫ్​గా ఉండాలా?- ఈ టిప్స్‌ పాటిస్తే సరి! - eye care tips for summer

వేసవిలో బీరకాయ తింటే ఏం జరుగుతుంది! నిపుణులు సమాధానం వింటే షాక్​ అవ్వాల్సిందే! - Health Benefits of Ridge Gourd

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.