ETV Bharat / health

పుచ్చకాయను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు! ఎందుకో మీకు తెలుసా ? - Never Store Watermelon In Fridge

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 3:13 PM IST

Never Store Watermelon In Fridge : వేసవి కాలంలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయలు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే, వీటిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదని కొంత మంది అంటుంటారు. అసలు పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

Never Store Watermelon In Fridge
Never Store Watermelon In Fridge

Never Store Watermelon In Fridge : ఎండాకాలం వచ్చేసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఎంతో భయపడిపోతున్నారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ ముక్కలు, చెరుకు రసం తీసుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వారు కూడా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచూ పుచ్చకాయలను తింటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, కొంతమంది పుచ్చకాయను కొనుగోలు చేసిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే, ఇలా అస్సలు చేయకూడదని నిపుణులంటున్నారు. అసలు పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో మీకు తెలుసా ? ఇప్పుడు తెలుసుకుందాం.

అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు! - Excessive Salt Consumption Signs

సమ్మర్‌లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ వీటిని తినడం వల్ల శరీరం చల్లబడుతుందని తెలియజేస్తున్నారు. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుందట. దీనివల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని పుచ్చకాయ తినడం వల్ల పొందవచ్చు. అలాగే పుచ్చకాయ తినడం వల్ల తొందరగా ఆకలి కాకుండా ఉంటుందని పేర్కొన్నారు.

పోషకాలు పుష్కలం :
పుచ్చకాయలో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులంటున్నారు. అలాగే ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.

పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదంటే ?
చాలా మంది పుచ్చకాయను ముక్కలుగా కట్‌ చేసుకుని, జ్యూస్‌లాగా చేసుకుని తీసుకుంటారు. అయితే, పుచ్చకాయను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదట. ఎందుకంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. 'యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్' నిర్వహించిన అధ్యయనం ప్రకారం, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన పుచ్చకాయలో, ఫ్రిజ్‌లో ఉంచిన వాటి కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే కట్‌ చేసిన పుచ్చకాయ ముక్కలను కూడా ఎప్పుడూ కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీ ఇంట్లో పుచ్చకాయలు ఉన్నట్లయితే వాటిని ఫ్రిజ్‌లో పెట్టకండి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సూపర్ రెసిపీ : మసాలా ఎగ్ బుర్జీ - నషాళానికి తాకాల్సిందే! - MASALA EGG BHURJI

మీ నెయిల్స్ తరచూ విరుగుతున్నాయా? - ఇలా చేశారంటే ఆ ప్రాబ్లమ్ రాదు! - Nails Breakage Prevent Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.