ETV Bharat / health

సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ - ఇవి తాగితే ఎండ వేడిమి, డీహైడ్రేషన్ మీ దరిచేరవు! ప్రిపరేషన్​ వెరీ ఈజీ! - Summer Homemade Drinks

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 3:05 PM IST

Summer Drinks
Summer Homemade Drinks

Summer Homemade Drinks : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ టైమ్​లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడం కోసం శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో మెజార్టీ పీపుల్ కొబ్బరి నీళ్లు, మజ్జిగ.. వంటివి తాగుతుంటారు. అయితే, ఇవి మాత్రమే కాదు.. మీరు ఈజీగా ఇంటి వద్దనే ప్రిపేర్ చేసుకునే కొన్ని సమ్మర్ డ్రింక్స్ ఉన్నాయి. అవేంటంటే?

Best Homemade Drinks for Summer: సమ్మర్​​ డ్రింక్స్ విషయానికొస్తే.. చాలా మంది మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటారు. అయితే, వీటితో పాటు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే, తక్షణమే శరీరానికి చల్లదనాన్ని అందించే కొన్ని హోమ్​ మేడ్ డ్రింక్స్ ఉన్నాయి. కొన్నిరకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు వాటర్​లో యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొనే ఈ డ్రింక్స్(Drinks) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజాలు.. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా మలినాలను తొలగించి బాడీని కూల్​గా ఉంచుతాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ డ్రింక్స్? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిమ్మకాయ షర్బత్ : ఇది సమ్మర్​ హోమ్ మేడ్ డ్రింక్స్​లో మొదటి వరుసలో ఉంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా ఒక గ్లాస్​లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పంచదార లేదా తేనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే.. హెల్దీ నిమ్మకాయ షర్బత్ రెడీ!

పుచ్చకాయ వాటర్ : వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ ఫ్రూట్ సమ్మర్​లో​ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ ఫ్రూట్​తో ప్రిపేర్ చేసుకునే ​డ్రింక్ కూడా వేసవిలో శరీరాన్ని చల్లబర్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం.. ఒక లీటరు వాటర్ తీసుకొని అందులో అరకప్పు చొప్పున పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. వీలుంటే.. నాలుగు కీరా ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు యాడ్​ చేసుకోని తాగడమే..

2017లో 'జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ & మెడిసిన్' అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పుచ్చకాయ వాటర్ వేడి వాతావరణంలో చెమట ద్వారా కోల్పోయే ద్రవాలను భర్తీ చేయడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో బ్రెజిల్​కు చెందిన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ డా. మార్కోస్ డి. బార్బోసా పాల్గొన్నారు. సమ్మర్​లో పుచ్చకాయ వాటర్ హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

వేసవిలో హైడ్రేటెడ్​గా ఉండాలా? ఈ 5 'సూపర్​ ఫ్రూట్స్' తింటే చాలు!

కీరా పుదీనా డ్రింక్ : ఈ హోమ్ మేడ్​ డ్రింక్ కూడా వేసవి వేడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాస్​లో వాటర్​ తీసుకొని అందులో కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొన్ని పుదీనా లేదా తులసి ఆకులు వేసుకోవాలి. అనంతరం దాన్ని కాసేపు ఫ్రిజ్​లో ఉంచి ఆ తర్వాత తాగండి. దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ దరిచేరదు. అంతేకాదు.. నిమ్మకాయలోని ఎలక్ట్రోలైట్లు శరీరానికి శక్తినిచ్చి రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

ఐస్డ్ హెర్బల్ టీ : ఇది కూడా మంచి హైడ్రేటింగ్ డ్రింక్. ఇందుకోసం మందార లేదా చమోమిలే వంటి మీకు ఇష్టమైన హెర్బల్ టీని తయారు చేసుకోండి. ఆ తర్వాత దానిని కాసేపు ఫ్రిజ్​లో ఉంచండి. ఆపై కొన్ని ఐస్​ ముక్కలు, హెర్బ్​తో గార్నిష్ చేసుకొని తాగేయండి.

పైనాపిల్ కోకోనట్ వాటర్ : ఎండ వేడిమి తగ్గించడంలో ఈ డ్రింక్​ కూడా చాలా చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని పైనాపిల్ ముక్కలు తీసుకొని జ్యూస్​లా చేసుకోవాలి. ఆపై అందులో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఫ్రిజ్​లో ఉంచి తీసుకుంటే సూపర్ సమ్మర్ హోమ్ మేడ్ డ్రింక్ రెడీ!

స్ట్రాబరీ నారింజ వాటర్ : ముక్కలుగా చేసిన స్ట్రాబెర్రీ, గుండ్రంగా తరిగిన నారింజ.. వాటర్​లో వేసుకొని తాగితే డీహైడ్రేషన్ తగ్గడమే కాకుండా.. శరీరానికి మంచి రిలీఫ్ దొరుకుతుందంటున్నారు నిపుణులు. అలాగే బాడీకి ‘విటమిన్ సి అందుతుందని, రక్తంలోని మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుందంటున్నారు నిపుణులు.

మింట్​ లెమన్ గ్రీన్ టీ : ఇది మంచి హైడ్రేటింగ్ హోమ్​ మేడ్​ డ్రింక్. ఇందుకోసం.. ముందుగా ఒక కప్పులో వేడి నీళ్లు తీసుకొని అందులో గ్రీన్ టీ బ్యాగ్​ను వేసుకోవాలి. ఆపై కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులు, తేనెను యాడ్ చేసుకొవాలి. ఆ తర్వాత కాస్త నిమ్మరసం పిండుకొని కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవాలి. అంతే.. మింట్ లెమన్ గ్రీన్ టీ రెడీ! ఇవేకాకుండా.. గులాబీ రేకులను నీటిలో వేసి ఆ నీటిని తాగినా.. శరీరంలోని అధిక వేడి అదుపులోకి వస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ డ్రింక్స్‌తో - సమ్మర్​లో ఈజీగా బరువు తగ్గొచ్చు! - Weight Loss Drinks

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.