ETV Bharat / entertainment

టాలీవుడే కాదు బాలీవుడ్​ కూడా ఈ సినిమాల కోసమే వెయిటింగ్​! - Tollywood Movies 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 10:08 PM IST

.
.

Tollywood Pan India Movies 2024 : వరుస సినిమా రిలీజ్‌లతో కళకళలాడే సమ్మర్‌ సీజన్‌ డ్రైగా మారిపోయిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన భారీ తెలుగు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే?

Tollywood Pan India Movies 2024 : మూవీ లవర్స్‌ సూపర్‌ హిట్‌, అత్యధిక వసూళ్లు, బాక్సాఫీస్‌ రికార్డులు వంటి మాటలు విని చాలా రోజులు అయింది. టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌లో కూడా ఈ సమ్మర్‌లో పెద్దగా సినిమాలు రిలీజ్‌ కాలేదు. సాధారణంగా పండగ సీజన్‌ల తరహాలోనే సమ్మర్‌లోనూ ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. కానీ 2024 సమ్మర్‌ సీజన్‌ అందుకు భిన్నంగా ఉంది. మే వరకు ఒక్క భారీ తెలుగు/హిందీ సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు.

  • దేవర, కల్కి కోసం ఎదురుచూపులు - గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో సౌత్‌ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలితో మొదలైన ట్రెండ్‌ను కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, పుష్ప 1, కార్తికేయ 2 కొనసాగించాయి. ఇటీవల హనుమాన్‌ కూడా ఉత్తరాది ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్​లో పఠాన్, జవాన్​, ఓ మైగాడ్​ 2, గద్దర్​తో పాటు మరో రెండు మూడు చిత్రాలు మాత్రమే ఆడాయి. బాలీవుడ్‌లో ఇటీవలే సమ్మర్ బాక్సాఫీస్ ముందు భారీ అంచనాలతో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ సినిమాలు కూడా వసూళ్లు అందుకోవడంలో, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త నిరాశపరిచాయి. దీంతో సమ్మర్​ బాక్సాఫీస్‌ వద్ద సందడి కనిపించలేదు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలుగు సినిమా పరిస్థితి విషయానికి వస్తే, దేవర, కల్కి 2898 AD వంటి భారీ-బడ్జెట్ మూవీల విడుదల వాయిదా పడడంతో ఇండస్ట్రీలో గ్యాప్‌ వచ్చింది. మధ్యలో టిల్లు స్క్వేర్ మినహా ఇతర చిన్న సినిమాలు అవకాశాన్ని అందిపుచ్చుకుని వసూళ్లు సాధించలేకపోయాయి. అయితే రాబాయే నెలల్లో వాయిదా పడ్డ టాలీవుడ్‌ భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ కల్కి 2898 AD, జూనియర్‌ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ తెరమీదకు వస్తున్నాయి.

దీంతో ఈ చిత్రాల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2, దేవర డబ్బింగ్ వెర్షన్లు, తమిళ స్టార్‌ సూర్య కంగువ మూవీలు హిందీ రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్‌ కానున్నాయి. ఇక ఈ చిత్రాలే కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ను మరోసారి ఆదుకునేందుకు రెడీగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రీరిలీజ్ రికార్డ్స్​ - టాప్​లో ఎవరున్నారంటే? - Rerelease records

పనిమనిషి ఆత్మహత్యాయత్నం - ప్రముఖ నిర్మాతపై పోలీస్ కేస్​ - Ke Gnanavel Raja

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.