ETV Bharat / bharat

కంచి చీరలు ఎందుకు అంత ఫేమస్​ - మీకు తెలుసా? - why Kanchipuram Sarees Popular

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 5:04 PM IST

Kanchipuram Sarees: పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు.. సందర్భం ఏదైనా ఆడవారు చీరలు కడతారు. అందులోనూ పట్టు చీరలంటే వారికి మహా ఇష్టం. అలాంటి పట్టు చీరల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. కంచిపట్టు చీరలు చాలా ఫేమస్. మరి, కంచి చీరలు ఎందుకు అంత ఫేమస్? మీకు తెలుసా?

why Kanchipuram Sarees Popular
why Kanchipuram Sarees Popular (ETV Bharat)

why Kanchipuram Sarees Popular: ఇంద్ర ధనస్సు వర్ణాలను రంగరించి.. ప్రకృతి అందాలను ఆకృతులుగా అచ్చేసిన పట్టు చీరలంటే.. ఏ మహిళకు మాత్రం నచ్చదు చెప్పండి. తమ తనువుపై మెరిసిపోతున్న పట్టు చీరను చూస్తే.. వారి మనసంతా మురిసిపోతుంది! ఎందుకంటే.. "సో బ్యూటీఫుల్​.. సో ఎలిగెంట్​.. జస్ట్​ లుకింగ్​ లైక్​ ఏ వావ్​" అన్నట్టుగా ఉంటాయి ఈ చీరలు. ఇందులోనూ కంచిపట్టు చీర అంటే.. మాటల్లో చెప్పలేని భావాలు వారి మనసులో మెదులుతాయి. మరి కంచి చీరలు ఎందుకంత స్పెషల్? ఈ విషయం తెలియాలంటే..​ ఈ స్టోరీ చూడాల్సిందే.

కంచి పట్టుచీరలను "కంజీవరం లేదా కాంచీపురం చీరలు" అని కూడా పిలుస్తారు. ఈ చీరలు తమిళనాడులోని కాంచీపురంలో తయారవుతాయి. అక్కడే ప్రత్యేకంగా వీటిని నేస్తారు. భారతీయ వస్త్ర ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ చీరలు కలిగి ఉన్నాయి. ఇవి ఇంత ఫేమస్​ కావడానికి పలు కారణాలు ఉన్నాయి.

స్వచ్ఛమైన పట్టు: కంజీవరం చీరలను స్వచ్ఛమైన పట్టుతో నేస్తారు. స్థానికంగా పండించిన పట్టుతో నేస్తారు. క్వాలిటీ పట్టు కారణంగా చీరలు కొత్త మెరుపు సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఇవి బరువు తక్కువ ఉంటాయి.

జరీ వర్క్​: కంచిపట్టు చీరలకు అంత లుక్​ రావడంలో పట్టు ఓ కారణమైతే.. జరీ వర్క్​ వేరే లెవల్​. ఇది చాలా కష్టతరమైంది. సాధారణంగా బంగారం లేదా వెండి దారాలతో జరీ వర్క్​ చేస్తారు. అందులోనూ ఈ వర్క్​ ఎవరు పడితే వారు చేయలేరు. ఎంతో నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు మాత్రమే చేయగలరు. అందుకే ఈ చీరలకు అంత లుక్​ వస్తుంది.

బోర్డర్స్​ అండ్​ పల్లు: చీర ఏదైనా దాని బోర్డర్​, పల్లు స్పెషల్​ లుక్​ను అందిస్తాయి. ఈ కంచి చీరల్లో అది అద్భుతంగా ఉంటుంది. బోర్డర్​ ఒక డిజైన్​, పల్లు ఒక డిజైన్​తో నేస్తారు. ఈ కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్​ చీర డిజైన్​, లుక్​ను మరో లెవల్​కు తీసుకెళ్తాయి.

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

సూపర్ డిజైన్స్​: కంచి పట్టుచీరలపై కళాత్మకమైన డిజైన్లను నేస్తారు. చిలుకలు, హంసలు, ఏనుగులు, మామిడి పిందెలు, ఆకులు, నెమళ్లు, రథాలు, పువ్వులు వంటి ఎన్నో రకాల డిజైన్స్​ వేస్తారు. ఇవి చీర సౌందర్యానికి దోహదపడటమే కాకుండా సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయి.

చేనేత : కాంచీపురం చీరలు తొందరగా పాడవకుండా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం వీటిని చేతితో నేయడం. ఈ రోజుల్లో చీరలను డిజైన్​ చేయడానికి ఎన్నో రకాల మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కంచి చీరలను చేతితోనే నేస్తారు. తరతరాలుగా ఈ పద్ధతే కొనసాగుతోంది.

రంగులు: ఇక చీరలు అంటే సప్తవర్ణాల కలబోత. కంచి చీరల్లో ఈ రంగులు హైలెట్​ అని చెప్పవచ్చు. అత్యంత ప్రసిద్ధమైన ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో నేసే చీరలు.. ఎవరికైనా సెట్​ అయ్యే విధంగా ఉంటాయి.

కంచి చీరలు.. సౌందర్యానికి మాత్రమే కాకుండా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రతీకగా ఉంటాయి. ప్రతి దారంలోనూ సంప్రదాయం, విలాసం కలగలిసి ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. ఈ చీరల ధరలు వేలు, లక్షల్లో ఉంటాయి.

అమ్మో.. ఈ చీర ధర రూ.21 లక్షలు.. అంత స్పెషలేంటో?

Designs on sarees: అచ్చెరువొందెలా.. చీరలపై చిత్తరువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.