డోలీలో నిండు గర్భిణీ.. అడవిలో 6కి.మీ నడక.. నాలుగు గంటల తర్వాత..

By

Published : Jul 26, 2022, 3:24 PM IST

thumbnail

ఎనిమిది నెలలు నిండిన గర్భవతిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో వెదురు డోలీలో మోసుకెళ్లారు ఆమె బంధువులు. సరైన రోడ్లు, అంబులెన్సు సదుపాయ లేకపోవడమే అందుకు కారణం. విమల్​ బాయ్​ దేవేంద్ర వాసవే అనే ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు గ్రామస్థుల సాయంతో సుమారు నాలుగు గంటల పాటు డోలీలో తీసుకెళ్లారు. ఆరు కిలోమీటర్ల దూరంలోని రాపాపుర్​ చేరుకునే వరకు వారికి అంబులెన్సు దొరకలేదు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందర్బార్​ జిల్లా కువాలీదబర్​ గ్రామంలో వెలుగు చూసింది. ఆస్పత్రికి వెళ్లాల్సిన ప్రతిసారి తమకు ఇదే పరిస్థితి ఎదురవుతోందని గ్రామస్థులు వాపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.