జాతీయ రహదారిపై ప్రజలకు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేత- వీడియో వైరల్
Congress Money distributed for People in Adilabad : జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేత ప్రజలకు డబ్బులు పంచుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 19న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశం జరిగిన అనంతరం ప్రజలు ఇంటికి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకుడు డబ్బులు పంచాడు.
Congress Money distributed Viral Video : అసిఫాబాద్లోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేత ప్రజలకు డబ్బులు పంచుతున్న(Congress Leader Money Pampini) వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. ప్రతి వ్యక్తికి రూ.100లుగా నిర్ణయించినట్లు స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ విషయం తమ దృష్టికి రాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఫుటేజ్ పరిశీలించి బాధ్యులపై వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.