Prathidwani On Gender Determination Tests : యథేచ్ఛగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు.. భ్రూణహత్యలు
Published: May 18, 2023, 10:34 PM

Prathidwani On Gender Determination Tests : సాంకేతికతను మానవ శ్రేయస్సుకు ఉపయోగించాలి. దుర్వినియోగం చేస్తే సమాజం విచ్ఛినం అవుతుంది. అందుకు ఉదాహరణ పెను సమస్యగా మారిన లింగ నిర్థారణ పరీక్షలు. చట్టం ప్రకారం ఈ విషయంలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల కాసుల కక్కుర్తి శిశువుల్ని చిదిమేస్తుంది. చట్టాలు, నిబంధనలు మరుగున పడి, బిడ్డల ప్రాణాలు పిండ దశలోనే గాలిలో కలిసిపోతున్నాయి. తల్లి కడుపుపలో పెరుగుతున్న పిండం ఆడా? మగా? అని నిర్ధారించడానికి రూ.10 వేలు గర్భస్రావం చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. స్కానింగ్ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డా అని తెలుసుకుంటున్నారు. ఆడ పిల్లైతే పురిట్లోనే ఊపిరి తీసేస్తున్నారు. తమ వ్యాపారం కోసం మనుషుల్ని పెట్టి మహీ గర్భిణులను గుర్తిస్తున్నారు. చట్టవిరుద్ధమైన లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తూ.. ఆడశిశువుల్ని చిదిమేస్తున్నారు. హైదరాబాద్లో గత ఏడాది లింగ నిర్ధారణకు సంబంధించి సుమారు 100 కేసులు నమోదు చేశారు. కొన్ని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో సాగుతున్న ఈ నిర్వాకాలను అడ్డుకోవడం ఎలా? భ్రూణహత్యల నివారణ విషయంలో తక్షణం చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని.