నారాయణపేటకు సాగునీటిని తీసుకురావడమే నా ప్రధాన ఎజెండా : రాజేందర్ రెడ్డి
Narayanapet BRS Candidate Rajendra Reddy Interview : నారాయణపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల అభివృద్ధి, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Telangana Assembly Election 2023 : నారాయణపేటలోని 80 శాతం గ్రామాలకు రోడ్డు అనేది లేకుండా ఉండేది.. ఇప్పుడు 98 శాతం గ్రామాలు, లంబాడీ తాండాలకు తారు రోడ్డు వేశామని చెబుతున్నారు. నారాయణపేట టౌన్‌లో ఆరోజు వారానికి ఆరుసార్లు నీళ్లు రాకుండా ఉండే.. కానీ ఈరోజు ప్రతిరోజు మిషన్ భగీరథతో మంచి నీటిని పంపిణీ చేస్తున్నాము. చేనేత రంగానికి నారాయణపేటలో ఈ పదేళ్లలో ఏం చేశారు? మిమ్మల్ని గెలిపిస్తే నారాణపేటకు చేసే ప్రత్యేక అభివృద్ధి ఏమిటి? మరోసారి గెలిపిస్తే ఏడాదిలోపు లక్షా 25వేల ఎకరాలకు సాగునీరు తెస్తామంటున్న రాజేందర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.