ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచుతాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Election Campaign in Jagtial : జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) అధికారంలోకి వస్తే.. ఏం చేస్తుందో.. ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రేషన్ కార్డు ఉన్న అందరికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
MLC Kavitha Explain BRS Manifest in Jagtial District : ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచుతామని కవిత(MLC Kavitha) అన్నారు. ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరతో పాటు నిత్యవసర ధరలను పెంచిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు పెంచిందని.. బీఆర్ఎస్ మళ్లీ వస్తే.. రూ.400కే ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతు రుణమాఫీ విషయంలో దాదాపు పూర్తి అయిందని.. ఇంకో దశ మిగిలి ఉందని అధికారంలోకి రాగానే చేస్తామని అన్నారు.