Mission Bhagiratha pipeline leakage in Lingapur : పైప్​లైన్​ లీకేజీతో.. మిషన్​భగీరథ ఉప్పొం'గంగ'

By

Published : May 25, 2023, 9:22 PM IST

thumbnail

Mission Bhagiratha pipeline leakage in Lingapur : రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్​భగీరథకు తరచూ లీకేజీలు సంభవిస్తున్నాయి. పైపుల నాణ్యతలో లోపమో లేదా ఆకతాయిల పనో పెద్దమొత్తంలో నీరు వృథా అవుతోంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామం వద్ద మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీ అయి పెద్ద మొత్తంలో నీరు బయటకు పోతోంది. పైప్​లైన్​ నుంచి వచ్చే నీరు ప్రెషర్​ వల్ల ఆకాశానికి తాకే విధంగా ఎగసిపడుతోంది. కొన్ని వేల లీటర్ల నీరు పక్కనున్న పంట పొలాల్లోకి వెళ్తోంది. వేంటనే స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. గతంలో కూడా ఇందల్వాయి మండలంలోనే పలు చోట్ల మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీలు జరిగాయి. దీంతో ఎగువనున్న ప్రాంతాలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. పంట కోసే సమయంలో పైప్​లైన్ లీకేజీ వల్ల నీరు చేనులోకి నీరు పోవడంతో.. పంట కోతలకు ఇబ్బంది అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.