'కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలో? తెలంగాణ రైతులు తేల్చుకోవాలి'
Minister KTR Fires on Revanth Reddy : కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలో? తెలంగాణ రైతులు తేల్చుకోవాలని మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వ్యవసాయానికి క్రాఫ్ హాలీడేలు, పరిశ్రమలకు పవర్ హాలీడేలు వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను దగా చేయడానికి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోందని అన్నారు. కొల్లాపూర్ సభలో రైతుబంధు పేరుతో రైతులకు కేసీఆర్ భిక్ష మేస్తున్నారని రేవంత్ విమర్శలు చేశారని మండిపడ్డారు.
Telangana Election 2023 : రాబందుల కాలం పోయింది.. రైతుబంధుల కాలం వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత 15వ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు వరి ఉత్పత్తిలో మొదటిస్థానంలో నిలిచిందని హర్షించారు. కాంగ్రెస్ వేసిన వందల కేసులను అధిగమించి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకోబోతున్నామన్నారు. పీసీసీ నిసిగ్గుగా వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలని.. మాట్లాడుతున్నారని.. ఈ విషయంపై రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.