ఎక్కడ చూసినా అదే ఫీవర్, రావి ఆకుపై వరల్డ్ కప్ చిత్రం - చూస్తే వావ్ అనాల్సిందే!
Ind vs Aus World Cup Final 2023 : దేశంలో ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. రాష్ట్రంలోని జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా తన నైపుణ్యాన్ని ఉపయోగించి వరల్డ్ కప్ చిత్ర పటాన్ని గీశాడు. దీంతో అందరి అభినందనలను పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి.. రావి ఆకు మీద వరల్డ్ కప్‌ని అద్భుతంగా మలిచాడు.
ICC World Cup 2023 : ఆకుపైన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ , ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఇండియా అని చిత్రించాడు. ఇంతకుముందు కూడా చారి ఇలాంటి ఎన్నో చిత్రాలను ఆకులు, సుద్ద ముక్కలపై చిత్రించి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్(India Book of Record), తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాందించుకున్నాడు.. వరల్డ్ కప్ పోటీల్లో ఇండియా టీం గెలవాలని ఆశిస్తూ.. అభిమానం కొద్దీ రావి ఆకు మీద చిత్రించినట్టు చారి తెలిపారు.