భారతజట్టు విజయం సాధించాలని అభిమానుల ఆకాంక్ష-బంగారంతో విభిన్న కళాఖండాల రూపకల్పన
Cricket Fans Innovates For India World Cup Match : ప్రపంచ క్రికెట్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో వారి అభిమానాన్ని చాటుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన యువ స్వర్ణకారుడు బియ్యపు గింజ పరిమాణంలో 0.110 మిల్లీ గ్రాముల బంగారు ప్రపంచ కప్ నమూనాతో పాటు.. స్టేడియం, బ్యాట్ బాల్, వికెట్ల నమూనాలను సైతం కేవలం 0.840 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి తయారు చేశాడు.
గతంలోనూ గోపి చారి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ వంటి సూక్ష్మా కాళాఖండాలను రూపొందించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన తుమ్మనపల్లి నరేష్ సైతం 0.100 మిల్లీగ్రామ్ బంగారంతో వరల్డ్ కప్ ను రెండు గంటల్లో తయారు చేసి క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయభేరి మోగించాలని ఈ కళాకారులు ఆశాభవం వ్యక్తం చేశారు.