కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణికి పూర్వవైభవం తీసుకొస్తాం : ప్రేమ్‌సాగర్‌రావు
Congress Candidate Prem Sagar Rao Interview : తలసరి ఆదాయమంటే సామాన్య ప్రజల బతుకులతో చూడాలే కానీ.. దేశంలోని జీడీపీని చూసి లెక్కకట్టకూడదని ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇస్తూ.. సింగరేణిని బతికించుకునేందుకు ప్రయత్నిస్తే.. బీఆర్ఎస్, బీజేపీ ఏలుబడిలో ఉపరితల గనులతో ప్రైవేటీకరణను ప్రోత్సహించే పని జరిగిందన్నారు. ఫలితంగా పారిశ్రామిక కారిడార్ అయిన సింగరేణిలో నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణికి పూర్వవైభవం తీసుకొస్తామని ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు.
సింగరేణిలో భర్తీ చేసిన ఉద్యోగాలేవని అధికార పార్టీని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనంతా మాటల గారడితోనే గడిచిందని ప్రేమ్ సాగర్ విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో మంచిర్యాల ముంపునకు గురవుతుందన్నారు. పక్కనే గోదావరి పారుతున్నా.. స్థానికంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ రాయితీ నిధులతో యువతకు ఉపాధి కల్పనకై కృషి చేసిందని తెలిపారు.