విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్
CM KCR at Pinapaka BRS Praja Ashirwada Sabha : బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దళితుల బతుకులు మారలేదన్నారు. పినపాక ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను కూడా గమనించాలని సూచించారు. విచక్షణతో ఓటు వేస్తేనే.. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారని ఆయన పేర్కొన్నారు. దళితుల బతుకులు మార్చేందుకే దళితబంధు తెచ్చామని చెప్పారు.
Pinapaka BRS Praja Ashirwada Sabha : తెలంగాణ ఏర్పాటు జరిగేనాటికి రైతులు అప్పుల్లో ఉన్నారన్న సీఎం.. అప్పుల బాధతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ధరణి ఉండటం వల్ల ప్రభుత్వం వేసే డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయని పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆరోపించారు. ధరణి, రైతుబంధు ఉండాలో.. వద్దో.. ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
CM KCR Comments on Telangana Congress : ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల కరెంట్ కావాలో.. వద్దో.. ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల గోల్‌మాల్ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. 2014లో తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నంబవర్ వన్‌గా ఉందని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రూ.2 వేల పింఛను ఇవ్వటం లేదని తెలిపారు. గతంలో మంచినీళ్లకు ఎంత ఇబ్బంది పడ్డామో గుర్తు చేసుకోవాలని చెప్పారు. మిషన్ భగీరథ వచ్చాక శుభ్రమైన తాగునీరు ప్రతి ఇంటికి చేరుతోందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.