Chandrababu followers Protest in Karnataka: కర్ణాటక గ్రామాలకు పాకిన నిరసనలు... చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళనలు
Chandrababu followers Protest in Karnataka: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. అరెస్ట్ అక్రమం అంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మెుదట ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఆందోళన కార్యక్రమాలు.. మెల్లమెల్లగా రాష్ట్రాలు దాటి దేశాలకు వ్యాపించాయి. చంద్రబాబు దార్శనికత ద్వారా లబిద్ధిపొందిన ప్రజలు బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రోడ్లపైకి వస్తున్నారు.
తాజాగా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కర్ణాటకలో ఆందోళనలు కొనసాగుతన్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ బెంగళూరు పట్టణంలో ఐటీ ఉద్యోగులు గత నాలుగు రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలు కర్ణాటక గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సింధనూర్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు.