Car Theft in Hyd : సాయం చేస్తానని చెప్పి.. కారుతో ఉడాయించాడు

By

Published : Apr 20, 2023, 1:02 PM IST

thumbnail

Car Theft in Hyderabad :  ఆగిపోయిన కారు నడిచేందుకు సాయం చేస్తానని చెప్పిన వ్యక్తి ఆ కారుతోనే ఉడాయించిన ఘటన హైదరాబాద్‌ గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. షాద్​నగర్​కు చెందిన నవీన్ కారులో ఓ హోటల్​ నుంచి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో కారు టీ జంక్షన్ వద్ద ఆగిపోయింది. కారు ఎయిర్​లాక్​ కావడంతో ఒంటరిగా కాసేపటి వరకు ముందుకు తోసుకుంటూ వెళ్లాడు నవీన్​.

అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న వ్యక్తి  ఏమైందని అడిగాడు. విషయం తెలిశాక.. తాను మెకానిక్​నని.. కారు స్టార్ట్ అయ్యేందుకు సాయం చేస్తానని చెప్పాడు. కారు డ్రైవింగ్​ సీట్లో కూర్చొని నవీన్​ను వెనుక వైపు నుంచి నెట్టమని చెప్పాడు. అతడు నిజంగానే మెకానిక్ అని నమ్మిన నవీన్ కాసేపు కారును నెట్టాడు. ఇంతలోనే కారు స్టార్ట్ అయ్యింది. ఇంకేం.. ఆ వ్యక్తి నవీన్​కు మస్కా కొట్టి కారుతో సహా ఉడాయించాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు.. అతడు చాలా దూరం వెళ్లిపోయాడు. ఈ ఘటన నుంచి తేరుకున్న నవీన్ గాంధీ నగర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.