Set Fire to Vehicles in Sangareddy : అర్ధరాత్రి అరాచకం.. 5 బైకులు, ఓ కారుకు నిప్పు
Published: May 21, 2023, 1:13 PM

Set Fire to Vehicles in Sangareddy : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రెండు వేర్వేరు చోట్ల ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక కారును గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామచంద్రాపురం బొంబాయి కాలనీలో నరసింహ అనే వ్యక్తి ఇంటి ముందు నిలిపి ఉంచిన 3 ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎవరూ చూడకపోవడంతో మూడు బైకులూ పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటలు వ్యాపించి.. పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ కారు ముందుభాగం పాక్షికంగా తగులబడింది.
బొంబాయి కాలనీ వెనక వీధిలో ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను సైతం దుండగులు తగులబెట్టారు. అవి పాక్షికంగా కాలిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు తగులబెట్టారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.