తండ్రి గెలుపు కోసం కుమార్తెల ఎన్నికల ప్రచారం
BRS Candidate Kadiyam Srihari Daughters in Election Campaign : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతుగా ఆయన కుమార్తెలు ప్రచారం చేస్తున్నారు. తమ తండ్రి గెలుపు కోసం స్టేషన్ ఘన్పూర్ మండలం శివుని పెళ్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
నియోజకవర్గంలో పనిచేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని కడియం శ్రీహరి కుమార్తెలు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, తమ తండ్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కూతురు కావ్య మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారని, కచ్చితంగా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.