కారులోనే స్విమ్మింగ్​ పూల్​, హెలిప్యాడ్​.. 100 అడుగులతో..!

By

Published : Mar 12, 2022, 2:14 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail

World's Longest Car: ఓ కారులో అత్యధికంగా 10 మంది కూర్చోవచ్చు. లిమోసిన్​ లాంటి పొడవైన కారులో 18 మంది ప్రయాణించొచ్చు. కానీ 70 మంది ప్రయాణించగలిగే కారు గురించి విన్నారా? అమెరికన్​ డ్రీమ్​గా పేర్కొనే ఈ కారు ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. 100 అడుగుల పొడవుగల ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్​ రికార్డులకు ఎక్కింది. స్విమ్మింగ్​ పూల్​, మినీ గోల్ఫ్​ కోర్స్​, హెలిప్యాడ్​, వాటర్​ బెడ్​ వంటివి ఏర్పాటు చేశారు అమెరికాకు చెందిన తయారీదారు జేయ్​ ఓహర్​బెర్గ్​. 26 చక్రాలతో నడిచే ఈ కారులో ముందు రెండు, వెనుక రెండు ఇంజిన్లు ఉంటాయి. మొదట ఈ కారును 60 అడుగుల పొడవుతో తయారు చేసినా.. ఆ తర్వాత దీనిని 100 అడుగులకు పొడిగించారు.

Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.