రాకింగ్ స్టార్​పై యువతి అభిమానం.. ఏడు కేజీల కేక్​లో 'యష్' రూపం

By

Published : May 9, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

Cake in the form of Yash: కేజీఎఫ్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ సీక్వెల్​తో ఆ అభిమానాన్ని మరింత పెంచేసుకున్నాడు ఈ కన్నడ స్టార్. ఎంతలా అంటే ఆ అభిమానాన్ని 7 కేజీల బరువుతో కేక్​లో ప్రతిబింబించేలా... హైదరాబాద్​కు చెందిన ఓ యువతి ప్రదర్శించింది. యువతి అనీలా.. 'బెకోలజీ బై అనీలా' పేరుతో డిజైనర్ కేక్​లను ఆర్డర్లపై అందిస్తుంది. కన్నడ స్టార్ యష్​కి ఆమె అభిమాని. ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 చిత్రం భారీ విజయం సాధించడంతో.. ఆ విజయాన్ని పురస్కరించుకుని కేక్ తయారు చేసింది. ప్రత్యేకంగా ఏడు రోజుల పాటు శ్రమించి యష్ రూపంలో కేక్ రూపొందించింది. ఇందులో 5 కేజీల కేక్​తోపాటు, 2 కేజీల వరకు చాక్లెట్​ని వినియోగించినట్టు వివరించారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.