అలా సంధ్యాసమయంలో.. పురి విప్పిన నెమలి నాట్యం
Published on: May 29, 2022, 1:10 PM IST

Peacock dance: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భానుడి భగభగలు తగ్గాయి. రోజంతా ఉక్కపోతలో మగ్గుతున్నా.. సాయంత్రం వరకు వాతావరణం చల్లబడుతోంది. వర్షాలతో కొమ్మలు చిగురిస్తున్నాయి. పరిసరాలు పచ్చగా మారడంతో ఆహ్లదకరంగా మారాయి. దీనికి తోడు చల్లని పిల్లగాలులు వీస్తుండటంతో మయూరాలు పులకరించి పోయాయి. పురి విప్పి వయ్యారాలు పోతూ నృత్యం చేసి ప్రకృతికి మరింత అందాన్ని అద్దాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో నెమళ్లు సాయంత్రం నృత్యం చేస్తూ చూపరులకు ఆహ్లదం పంచాయి.
Loading...