రేపు జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ దశదిశ చూపిస్తారు: హరీశ్‌రావు

By

Published : Jan 17, 2023, 3:50 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

Etvbharat exclusive interview with harish rao: టీఆర్‌ఎస్‌ మొదటి సభకు కరీంనగర్‌ వేదిక అయ్యిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ మొదటి సభకు మాత్రం ఖమ్మం వేదిక అయ్యిందని తెలిపారు. ఖమ్మం సభ ఏర్పాట్లపై ఈటీవీ భారత్... మంత్రి హరీశ్‌రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు.. ఖమ్మం సభ గురించి పలు ఆసక్తి కర విషయాలు తెలిపారు. తమ జిల్లాలోనే సభ జరపాలని చాలా జిల్లాల నేతలు కోరారని తెలిపారు. నాలుగు జాతీయ పార్టీల నేతలు రేపు బీఆర్ఎస్ సభకు హాజరవుతున్నారని స్పష్టం చేశారు. 

''ఇటీవల కాలంలో జాతీయ స్థాయి నేతలంతా ఒకే వేదిక మీదకు వచ్చిన సందర్భం లేదు. ఇతర రాష్ట్రాల నేతలతో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ చర్చిస్తారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. బీజేపీది కేవలం మేకపోతు గాంభీర్యం. దేశంలో ఏ ఒక్క వర్గానికి బీజేపీ మేలు చేయలేదు.'' - మంత్రి హరీశ్‌రావు

రైతులకు నష్టం చేసే 3 చట్టాలు తెచ్చి తీవ్రంగా ఇబ్బంది పెట్టారని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. నేడు తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అభివృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అధికమని వెల్లడించారు. దేశ ప్రజల్లో భాజపా పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు కొత్త ప్రత్యామ్నాయ శక్తి కోసం చూస్తున్నారని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై రేపు కేసీఆర్‌ దశదిశ చూపిస్తారని వివరించారు. 

వీటిపై ఓ లుక్ వేయండి:

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.