Accident CCTV Footage: డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం
Published on: May 9, 2022, 7:54 PM IST

Accident CCTV Footage: హైదరాబాద్ నాచారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు కింద పడి చిన్నారి దుర్మరణం చెందింది. నాచారంలోని ఓ కాలనీలో ఆగి ఉన్న కారు వెనకాల ఉన్న చిన్నారిని గుర్తించని డ్రైవర్.. నిర్లక్ష్యంగా వాహనాన్ని వెనక్కి తీశాడు. దీంతో చిన్నారి కారు టైరు కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. పాప కేకలతో బండి ఆపి దిగి చూసేసరికి వాహనం చక్రాల కింద రక్తపు మడుగులో ఉన్న చిన్నారి అప్పటికే చనిపోయింది. స్థానికుల సమాచారంతో సమాచారం అందుకున్న నాచారం పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Loading...