ఇండియన్​ కార్​ రేసింగ్​లో తప్పిన ప్రమాదం డ్రైవర్​ అప్రమత్తతతో

By

Published : Nov 20, 2022, 12:13 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ ప్రాంతంలో ఇండియన్​ కార్​ రేసింగ్ పోటీలు​ ఉత్సాహంగా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పోటీలను నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రేసింగ్​లో పెను ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐ మ్యాక్స్ ఎదుట ట్రాక్ మీదుగా అతివేగంతో దూసుకెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో కారు అదుపుతప్పింది. డ్రైవర్​ అప్రమత్తంగా వ్యవహరించి కొద్ది దూరంలో ట్రాక్​ పక్కన కారును నిలిపివేశాడు. ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.