హిమాచల్​లో భారీగా హిమపాతం పంట పొలాలను కప్పేసిన మంచుచరియలు

By

Published : Jan 21, 2023, 10:53 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

హిమాచల్​ప్రదేశ్​లోని లాహౌల్ వ్యాలీలో హిమపాతం విరుచుకుపడింది. పీర్ పంజల్ పర్వతాల నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ రైతుల పొలాలు, తోటలకు నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. కొండపై నుంచి మంచు చరియలు పడడం వల్ల పెద్ద శబ్దం వచ్చిందని గోషాల్ గ్రామానికి చెందిన స్థానికులు చెప్పారు. భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి వచ్చినట్లు తెలిపారు. మంచు చరియలు పడి తమ పొలాలు మంచు కప్పేసిందని రైతులు వాపోయారు. హిమపాతం చంద్రభాగ నదిని దాటి మరో గ్రామానికి చేరుకుందని వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని మంచు కురువడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమయిందని లాహౌల్ స్పితి కలెక్టర్ సుమిత్ చెప్పారు. ప్రతికూల వాతావరణం కారణంగా మూడు జాతీయ రహదారులు మూసివేసినట్లు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.