మీ పెంపుడు కుక్కకు వ్యాక్సిన్​ వేయించారా?.. లేకుంటే ఇబ్బందే!

author img

By

Published : Sep 9, 2022, 8:00 AM IST

Precautions to be taken to prevent rabies infection

మనం సాధారణంగా కుక్కలను పెంచుకుంటాం.. కొెంత మంది వీధి కుక్కలను చేరదీస్తారు. ఇంట్లో పెంచుకునే ఏ కుక్కకైనా వ్యాక్సిన్​ వేయించటం తప్పనిసరి లేకుంటే కరిస్తే అవి కరిస్తే రెబీస్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని జనరల్‌ ఫిజిషియన్లు సూచిస్తున్నారు.

Tips to Prevent Rabies : కుక్కలను పెంచుకోవడం చాలా మందికి సరదా..ఆ సరదానే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇంట్లో పెంచుకునే కుక్కకు వ్యాక్సిన్‌ వేయించడం చాలా ముఖ్యం. వీధి కుక్కకరిస్తే మాత్రం తప్పనిసరిగా మనమే వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. గతంలో లాగా బొడ్డు చుట్టూ ఇంజిక్షన్లు వేయించుకునే పరిస్థితి ఇపుడు లేదు..ఐదు ఇంజిక్షన్లు భుజానికే వేస్తున్నారు. ఇంట్లో కుక్కయినా, వీధిలోని కుక్కయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరిస్తే రేబీస్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని మరవొద్దని జనరల్‌ ఫిజిషియన్లు సూచిస్తున్నారు.

ప్రమాదమే సుమా : వీధి కుక్కలకు వ్యాక్సిన్‌ వేసే అవకాశాలు చాలా తక్కువ. వాటికి సాధ్యమయినంత వరకు దూరంగా ఉండాలి. రేబీస్‌ వైరస్‌ సోకితే ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది. అయినా చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేయడంతోనే సమస్యగా మారుతోంది. వైరస్‌ నరాలపై ప్రభావం చూపిస్తుంది. నరాల నుంచి వైరస్‌ మెదడు దాకా వెళ్తుంది. ఆ సమయంలో నరాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది.

మరికొంత మందికి అతిగా స్పందించే లక్షణం బయట పడుతుంది. కుక్క కరిచినపుడు గాయ పడిన చోట 15 నిమిషాలు ధారగా నీరు పడుతున్న చోట కడగాలి. యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించాలి. కుక్క కరిచిన చోట మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారిపోయినా వదిలేయాలి. దాంతో వైరస్‌ వెళ్లిపోతుంది. అవసరమైన యాంటీబయోటిక్స్‌, నొప్పి నివారణ మందులను వైద్యులు సూచిస్తారు. ఇంట్లో పెంచుకున్న కుక్కకు మూడేళ్లకోసారి వ్యాక్సినేషన్‌ చేయించాలి.

ఇదీ చదవండి: మోకాళ్ల నొప్పి వేధిస్తోందా? అయితే ఈ పరిష్కార మార్గాలు మీకోసం!

క్యాన్సర్​ వస్తే మరణం తప్పదా.. ఇది ఎంతవరకు నిజం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.