బరువు పెరగడం లేదా? కారణాలు ఇవే కావొచ్చు..!

author img

By

Published : Sep 14, 2021, 5:34 PM IST

How to Gain Weight

కొందరు వయసుకు తగిన బరువు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు తామెందుకు బక్కగా ఉన్నామని ఆలోచిస్తూ ఉంటారు. మరి అందుకు గల కారణాలు ఏంటో తెలుసా?

కొందరు వయసుకు తగిన బరువు లేక బాధపడుతూ ఉంటారు. ఎంత తిన్నా లావు కావట్లేదని దిగులు చెందుతుంటారు. అందరూ బక్కగా ఉన్నావని అంటుంటే ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. దీంతో తీవ్ర ఒత్తిడితో బరువు పెరగడానికి(How to gain Weight) విఫల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బరువు పెరగకపోవడానికి గల కారణాలు తెలుసుందామా?

కారణాలు ఇవేనా?

ముందుగా మీరు సరైన పద్ధతిలో తినడం అలవాటు చేసుకోండి. అందుకోసం వీలైతే న్యూట్రిషనిస్ట్ సహాయం తీసుకోండి. థైరాయిడ్, షుగర్ లాంటి సమస్యలు ఉన్నా కూడా బరువు పెరగరు. అందుకోసం మీరు ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా అనేది తెలుసుకోండి.

ఎలా బరువు పెరగొచ్చు..

ముందుగా సరైన వేళల్లో భోజనం తినాలి. మీరు తినే పదార్థాల్లో పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ఎక్స్​ర్​సైజ్​లు చేయాలి. విశ్రాంతి కూడా తగినంత తీసుకోవాలి. ఇవన్నీ చేసినా బరువు పెరగట్లేదు అంటే ఓసారి న్యూట్రిషనిస్ట్​ను కలిసి సలహా తీసుకోండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.