దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా?.. ఈ వంటింటి చిట్కాలతో చెక్​ పెట్టేయండి!

author img

By

Published : Nov 25, 2022, 7:09 AM IST

home-remedies-for-cough-and-cold

శీతాకాలంలో పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో వంటింటి చిట్కాలతో తొందరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం రండి.

Home Remedies For Cold : చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు మామూలే. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో కిచెన్‌లోని కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం, గార్గిల్‌ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. 'వంటగదే మన ఫార్మసీ' అంటూ కొన్ని చిట్కాలను పంచుకుంటున్నారు.. మరి అవేంటో చూద్దాం రండి..

  • ఒక టీస్పూన్‌ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.
  • రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలి.
  • ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ, కివీ మొదలైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
అల్లం తులసీ మిశ్రమం
  • ఒక లీటరు నీటిలో 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్‌ చొప్పున వాము, మెంతులు, పసుపు, 4-5 నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.
  • స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించద్దు.
  • జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.
  • ఏమైనా గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది.
  • సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్‌టీలు తాగడం మంచిది.
పసుపు పాలు
  • గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.
  • గొంతునొప్పి వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్‌ చేయాలి.
  • తులసి ఆకులు నమలాలి.
  • వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి. వీలైనంతవరకు ఇంట్లో వండిన, తేలికగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.