చలికాలంలో వ్యాధుల నుంచి రక్షణకు ఇవి తినేయండి!

author img

By

Published : Jan 6, 2022, 7:00 AM IST

Health tips for cold weather

Health tips for cold: చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ప్రజలు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?

Health tips for cold: చలికాలంలో ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వాటి నుంచి రక్షణ కల్పించే ఆహారం ఇది..

పోషకాల లడ్డూ..

నెయ్యి, డ్రైఫ్రూట్స్‌, రాగిపిండితో చేసిన లడ్డూలు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు తగినంత వేడిని, రక్షణను అందిస్తాయి. వీటిని తింటే రోగనిరోధకత పెరుగుతుంది. దాంతో ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటి వల్ల పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. దాంతో బరువూ నియంత్రణలో ఉంటుంది. రోజూ ఉదయం పాలతోపాటు ఓ లడ్డూ పిల్లలకూ పెట్టండి. మీరూ తినండి.

ఉసిరి

ఉసిరి. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్‌, ఔషధ సమ్మేళనాలు మెండు. విటమిన్‌ సి తోపాటు ఐరన్‌, క్యాల్షియం, పీచు కూడా తగినంత మోతాదులో ఉంటాయి. దీన్ని ఉదయంపూట తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్‌, స్కిన్‌ హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఉసిరి చట్నీ, జ్యూస్‌, మురబ్బా.. ఇలా ఏ రూపంలోనైనా తీసుకోండి.

best food for cold
ఉసిరి

నెయ్యి పదార్థాలు

దేశవాళీ నెయ్యిలో విటమిన్‌ ఎ, ఇ, కె, ఒమేగా-3, 9 ఫ్యాటీ ఆమ్లాలు మెండు. కాబట్టి దీన్ని ఈ కాలం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ కనీసం ఓ చెంచా నెయ్యిని తింటే జీవక్రియలు మెరుగ్గా సాగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. తల తిరగడం, బలహీనత లాంటి సమస్యలకు చెక్‌ పెట్టి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడుతుంది.

డ్రైఫ్రూట్స్‌

రోజూ ఉదయం ఓ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ను తినండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొట్టలోని పీహెచ్‌ స్థాయులను బ్యాలెన్స్‌ చేస్తాయి. దాంతో శరీరానికి కావాల్సిన వేడిమి అందుతుంది. అయితే వీటిని నిర్ణీత మొత్తంలోనే తీసుకోవాలి.

best food for cold
డ్రైఫ్రూట్స్‌

ఇదీ చూడండి: బూస్టర్ డోసు.. మహమ్మారిని ఎదుర్కొనే కొత్త ఆయుధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.