Halasana Benefits: ఒత్తిడి తగ్గించే ఆసనం ఇదే!

author img

By

Published : Sep 23, 2021, 4:16 PM IST

Halasana

ఉరుకుల పరుగుల జీవితం మనది. దీనిలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిని దూరం చేయాలంటే ఈ ఆసనం((Halasana Benefits)) వేయాల్సిందే. ఇంతకీ ఆ ఆసనం ఏంటి? దానిని ఎలా వేయాలి?

యోగాసనాల్లో హలాసనం (Halasana Benefits) అనేది చాలా ముఖ్యమైంది. దీనిని ప్రతిరోజు వేయడం ద్వారా నడుము, మెడకు చాలామంచిది. తరుచూ ప్రాక్టీస్​ చేయడం వల్ల శరీరంలో ఉండే ఒత్తిడి తగ్గి, ముఖంలో కాంతి పెరుగుతుంది. అయితే ఈ హలాసనం ఎలా వేయాలో ఓ సారి చూద్దాం.

హలాసనం ఎలా వేయాలంటే..

నడుము, మెడకు చాలా మంచిదైన ఈ హలాసనం వేయాలి అంటే ముందుగా మనం ఒక దిండును పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆసనం వేసేటప్పుడు కాళ్లు ముఖానికి తగలకుండా ఉండడానికి ఇలా చేస్తాం. దీంతో గాలి పీల్చుకోవడం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి ఆసనానికి ముందుగా వార్మప్​ అవసరం. దీనికోసం మోకాళ్లపైకి వచ్చేయాలి. చేతులను కిందకు తాకించాలి. అప్పుడు మనం మాంచిర్యాసనంలో ఉంటాం. ఇప్పుడు వీపును కిందకి, పైకి కొంత సేపు అంటూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు పైకి చూస్తూ.. వదిలేటప్పుడు కిందకు చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వీపులో ఉండే కండరాలు చాలా ఫ్లెక్సిబుల్​గా మారుతాయి.

ముఖ్యంగా వీపు కింది భాగంలో ఉండే కండరాలు బాగా వదులుగా తయారవుతాయి. ఇలా కొంతసమయం పాటు చేయాలి. తరువాత కింద ఉన్న చాపపై పడుకోవాలి. కాళ్లను ముందుకు వెనక్కి అంటూ వార్మప్​ చేయాలి. దీంతో కాళ్లలో ఉండే కండరాలు వదులుగా మారి ఆసనానికి అనుకూలంగా ఉంటాయి. తరువాత మోకాళ్లను వెనక్కి తీసుకోవాలి. నడుమును పైకి లేపాలి. ఇలా కొంతసేపు ఇలానే చేస్తా ఉండాలి. అనంతరం కుడి కాలును పైకి లేపాలి. తరువాత ఎడమ కాలును పైకి లేపాలి. ఇలా చేసేటప్పుడు కాళ్లు రెండు ఆకాశాన్ని చూసేలా ఉండాలి. ఇది పూర్తయిన తరువాత నడుమును చాపకు ఆనించాలి. ఇప్పుడు రెండూ కాళ్లను రెండు పైకి లేపాలి. ఇలా చేయడం ద్వారా కాళ్ల వెనకాల ఉండే కండరాలు ఆసనానికి సిద్ధం అవుతాయి.

దీని తరువాత చాప చివరి భాగానికి వెళ్లి.. కాళ్లను వెనక ఉన్న దిండుపై పెట్టే ప్రయత్నం చేయాలి. ఇలా చేసేటప్పుడు చేతులను నడుము భాగానికి సపోర్ట్​గా ఉంచుకోవాలి. ఇలా చేసేటప్పుడు మెడను పక్కకు తిప్పాలి. ఇలా కొద్దిచేస్తే హలాసనం పూర్తి అవుతుంది. అయితే ఈ ఆసనాన్ని స్త్రీలు నెలసరి సమయాల్లో చేయడం మంచిది కాదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఆసనం చేయడం ద్వారా నడుము చాలా ఫ్లెక్సిబుల్​గా తయారవుతుంది. శరీరంలో ఉన్న ఒత్తిడి అంతా దూరమవుతుంది. ముఖంలో కూడా మంచి గ్లో వస్తుంది.

ఇదీ చూడండి: ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.