ఏ వయసులో శృంగారంపై ఆసక్తి తగ్గుతుందో తెలుసా?

author img

By

Published : Nov 10, 2021, 8:38 AM IST

experts on sexual desire

రొటీన్​గా చేసే పనిపై విసుగు చెందడం అనేది సర్వసాధారణమైనది. అయితే సెక్స్​ చేసేటప్పుడు మాత్రం విసుగు రాదు. పైగా చాలా మందికి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. సెక్స్​ పట్ల ఈ ఆసక్తి ఇలాగే కొనసాగుతుందా? ఏ వయసులో శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది?

సెక్స్​పై ఆసక్తి పూర్తిగా తగ్గడం అనేది ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది మగవారిలోనైనా, ఆడవారిలోనైనా సరే. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత హార్మోన్స్​ తగ్గడం ద్వారా మనిషి సెక్స్​లో పాల్గొనలేకపోవచ్చేమో కానీ ఆ సెక్సువల్​ థాట్స్​ మాత్రం ఉంటాయని చెప్తున్నారు.

శృంగారం పట్ల ఆసక్తి తగ్గకపోవడానికి మరో కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫీల్​ గుడ్​ హార్మోన్స్​ అని నిపుణులు పేర్కొన్నారు.

మానసికంగా నియంత్రించుకుంటే తప్ప ఆ ఆసక్తి అనేది తగ్గదని తెలిపారు. 'సెక్స్​ వల్ల కలిగే అనుభూతిని పొందాలని అనుకునే వారు నెల లేదా రెండునెలలకు ఓసారైనా సెక్స్​లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.' అని పేర్కొన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు రోజుకు మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు సెక్స్​లో పాల్గొంటారని.. ఆ తర్వాత అది క్రమంగా తగ్గుతూ వస్తుందని తెలిపారు. వృత్తి, వ్యాపారాల కారణంగా వచ్చే ఒత్తిడి కూడా సెక్స్​పై ఉన్న ఆసక్తి తగ్గడంలో ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మేలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.