ఈ ఒక్క పండుతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

author img

By

Published : May 14, 2022, 8:21 AM IST

Avocado Benefits

Avocado Benefits: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పోషకాలు గల పండ్లలో అవకాడో ఒకటి. మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఈ ఫలంలో శరీర బరువును తగ్గించే గుణం ఉంటుంది. షుగర్​ వ్యాధిగ్రస్తులపాలిట వరంగా చెప్పవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్​ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. అవకాడోలో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Avocado Benefits: ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న పండ్లలో అవకాడో ఒకటి. మంచి కొవ్వులుగా పిలుచుకునే అవకాడోను తినడం వల్ల స్త్రీ, పురుషుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 18 మిలియన్​ మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న వ్యాధుల్లో కార్డియో వాస్కులర్​​ వ్యాధి ఒకటి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది. ఇది హైక్యాలరి ఫుడ్​ కనక వారానికి రెండు మాత్రమే తీసుకోవాలని.. వీటిని తినేటపుడులో క్యాలరీ ఆహరంతో కలిపి తీసుకుంటే బ్యాలెన్స్​ అవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వు అధికంగా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ 100 గ్రాముల పండులో ​170 క్యాలరీలు ఉంటాయి. 8 గ్రాముల కార్భోహైడ్రెట్స్, తక్కువ మోతాదులో ప్రోటీన్లు కూడా ఉంటాయి.

అవకాడో ఎల్​డీఎల్​ కొలెస్ట్రాల్​ను తగ్గించి హెచ్​డీఎల్​ కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. క్యాన్సర్​, మధుమేహం, హైపర్​ టెన్షన్​ను అదుపు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉండడం వల్ల రక్తపీడనం సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతుంది.ఈ పండ్లు తీసుకున్న వారిలో 21 శాతం గుండె నొప్పులు తగ్గుతాయి. విటమిన్లు ఏ, ఈ, బీ తో పాటు ఫైబర్​, ఖనిజాలు ఉంటాయి. కీళ్లనొప్పుల వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

అవకాడోలో ఆరోగ్యవంతమైన కొవ్వు ఉండటం వల్ల సహజంగా బరువు పెరగాలి అనుకునేవాళ్లకు ఇది వరంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఏజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ​ ఇవి మన చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా వయసు తక్కువ కనిపించేలా చేస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే ముడతలను తగ్గించి యవ్వనంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది. వెన్న, గ్రుడ్లు, చీజ్, పెరుగు, ప్రోసేస్​ చేసిన మాంసానికి బదులుగా అవకాడోను తీసుకుంటే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. వెన్నపండు పేరుతో పిలుచుకునే అవకాడోను సాండ్​విచ్​, ఐస్​క్రీమ్​ తయారీలో వీటిని ఉపయోగిస్తున్నారు.

మంచి కొవ్వుగా పేరున్న అవకాడోను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటు బరువు, రక్తపొటు, కొలెస్ట్రాల్​ నియంత్రణలో ఉంచుకుంటూ.. కంటినిండా నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, చక్కెర తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మద్యపానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లను తగ్గించడం వంటి జీవన శైలి మార్పులను అలవర్చుకుంటే మన గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా మరింత పదిలంగా ఉంచుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: ఈతతో లాభాలెన్నో.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.