Rajagopal Reddy Resignation: 'అలా చేస్తే నేనే దగ్గరుండి తెరాసను గెలిపిస్తా'

author img

By

Published : Sep 21, 2021, 8:09 PM IST

komati-reddy-rajagopal-reddy-adhere-to-his-resignation

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి(mla komatireddy rajagopal reddy) గతంలో చేసిన రాజీనామా సవాల్​కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలందరికి దళితబంధు(dalitha bandhu telangana) ఇస్తే.. రాజీనామా చేయటమే కాకుండా.. తెరాస ఎమ్మెల్యేను దగ్గరుండి గెలిపిస్తానని ఉద్ఘాటించారు.

మునుగోడు నియోజవర్గంలో ఉన్న ఎస్సీలందరికి దళిత బంధు పథకాన్ని(dalitha bandhu telangana) అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(mla komatireddy rajagopal reddy) పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గలకు నిధులు ఇవ్వకుండా సీఎం కేసీఆర్​... వివక్ష చూపుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా.. అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలకు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డికి రిబ్బన్ కట్ చేయడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పటికీ అదే మాట మీదున్న..

"ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు, అల్లుడు నియోజకవర్గాలకేమో వేల కోట్ల నిధులతో అభివృద్ధి. దక్షిణ తెలంగాణ ప్రాంతంపై సవతి ప్రేమ. మిగతా నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశిండ్రు. కాంగ్రెస్​ నాయకులకు ఓట్లేసి గెలిపించటమే.. వాళ్ల పాపమా..? వరదలొచ్చి మునిగిపోతే చూసే నాథుడు లేడు... రైతులను పట్టించుకోరు... పంట నష్టం ఇవ్వరు.. ప్రాజెక్టుల విషయంలో కూడా నిర్లక్ష్యం.. ఇప్పటికైనా ఈ వివక్ష ధోరణి మానేసి ఈ ప్రాంత అభివృద్ధికి వెంటనే రూ.100 కోట్లు విడుదల చేయాలి. నేను ఇప్పటికే సవాల్​ విసిరాను. మునుగోడు నియోజకవర్గంలోని ఎస్సీలందరికి దళితబంధు ఇస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని. ఇప్పటికైనా అదే మాటమీదున్న. రాజీనామా చేస్తా. పోటీకి కూడా నిలబడను. నేనే దగ్గరుండి తెరాస అభ్యర్థిను గెలిపిస్తా."

- కోమటిరెడ్డి రాజ్​గోపాల్​రెడ్డి, ఎమ్మెల్యే

'అలా చేస్తే నేనే దగ్గరుండి తెరాసను గెలిపిస్తా'

సంబంధిత కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.