Heavy Traffic at toll plaza: పంతంగి వద్ద భారీగా నిలిచిన వాహనాలు.. కిక్కిరిసిన హన్మకొండ బస్టాండ్

author img

By

Published : Oct 17, 2021, 7:22 PM IST

Updated : Oct 17, 2021, 7:47 PM IST

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

దసరా పండుగ ముగిసింది. సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు తిరుగుబాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.

దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.

పంతంగి వద్ద భారీగా నిలిచిన వాహనాలు
పంతంగి వద్ద భారీగా నిలిచిన వాహనాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఫాస్ట్ ట్యాగ్ పద్ధతి అమల్లో ఉండడంతో వాహనాలు నిమిషాల వ్యవధిలోనే టోల్ గేట్ నుంచి వెళ్లిపోతున్నా.. రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్‌ వైపు వచ్చే వాహనాల సంఖ్య పెరగడంతో జాతీయ రహదారిపై రద్దీ మరింత పెరుగుతోంది.

Heavy Traffic at toll plaza
పంతంగి వద్ద భారీగా నిలిచిన వాహనాలు

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటుండంతో జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. పండక్కి ఊరెళ్లిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం నుంచే హైదరాబాద్‌ పయనమవడంతో విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో రద్దీ అధికమైంది. సాయంత్రానికి వాహనాల రద్దీ మరింత పెరిగింది. కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్‌లో అండర్‌పాస్‌ వంతెన లేకపోవడంతో పండుగ వేళ, శుభకార్యాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది.

పంతంగి వద్ద భారీగా నిలిచిన వాహనాలు

కిక్కిరిసిన హన్మకొండ బస్టాండ్

బతుకమ్మ పండుగ ముగియడంతో హన్మకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దసరా పండుగ ముగిసిన ఆనంతరం తిరిగి నగరానికి వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండుకు పోటెత్తారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రయాణికులతో హనుమకొండ బస్టాండు కిటకిటలాడింది. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లేందుకు బస్సుల వద్ద బారులు తీరారు. హైదరాబాదు వెళ్లే బస్సుల వద్ద ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. బస్సుల కోసం పిల్లపాపలు, లగేజీ బ్యాగులతో పడిగాపులు కాశారు. పండుగను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

hanmakonda
కిక్కిరిసిన హన్మకొండ బస్టాండ్

ఇదీ చూడండి: Electronic sales in festive season: ఎలక్ట్రానిక్​ ఉపకరణాల జోరు.. రెండింతలు పెరిగిన అమ్మకాలు

Last Updated :Oct 17, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.