"భళా మోదీ భళా" ప్రత్యేక ఆకర్షణలో వినాయకుని విగ్రహం

author img

By

Published : Sep 1, 2022, 4:12 PM IST

Vinayaka Chavithi celebrations

Warangal City Variety Ganesh: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యువకులు,పెద్దలు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అందరూ కలిసి గణనాధుడుని వివిధ రూపాల్లో వివిధ ఆకృతిలో తయారుచేసి పూజిస్తున్నారు. పుష్ప, ఆర్​ఆర్​ఆర్​ స్టైల్​లో విగ్రహాలు తయారుచేసి తమ అభిమాన నటుల్ని వినాయకుని రూపంలో కొందరు కొలుచుకుంటే, హనుమకొండలో మోదీ, వినాయకుని భుజంపై తీసుకెళ్తున్నట్లు తయారు చేసిన విగ్రహం ఇప్పడు ప్రత్యేక ఆకార్షణగా కనిపిస్తోంది.

Warangal City Variety Ganesh: వినాయక చవితి ఈ పండక పేరు చేబితెనే భారతీయుల్లో చెప్పలేని ఉత్సహాం. కారణం భారతీయ పండుగల్లో ముందుగా వచ్చే పండుగ వినాయక చవితి. ఏపని మెుదలు పెట్టిన మెుదట వినాయకుని పూజిస్తే ఆ పని విజయవంతం అవుతుందని నమ్మకం. అలా భక్తులు వివిధ రూపాల్లో, వివిధ ఆకృతిలో వినాయకుని పూజించండం ఆనవాయితీగా వస్తోంది.

ఇప్పటికే పుష్ప, ఆర్​ఆర్​ఆర్​,గబ్బర్​సింగ్​, కిక్రెట్​ ఆటగాళ్లు రూపంలో మనం విగ్రహాలు కొలువు తీరడం చూశాం. ఇప్పడు తాజా వరంగల్​ జిల్లా హనుమకొండలోని గుడి బండల్​ ప్రాంతంలో ప్రధాని మోదీ వినాయకుడిని తన భూజాలపై మోస్తున్నట్లు ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని స్థానిక యువకులు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజాలు చేయగా భాజపా అధికార ప్రతినిధి రాకేష్​ రెడ్డి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

ప్రధాని మోదీ వినాయకుని ఎత్తుకొని ఉన్న విగ్రహం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.